వెంటవెంటనే క్యాచ్ డ్రాప్స్..
ఆ ఫైర్ ఉన్న విరాట్ కోహ్లీ ఒకటి కాదు.. రెండుసార్లు..అదీ వెంటవెంటనే క్యాచ్ డ్రాప్ చేయడం అనేది మన ఊహకు కూడా అందదు. ఒకసారి అనుకుంటే ఫర్వాలేదు. రెండోసారి కూడా క్యాచ్ డ్రాప్ చేస్తే.. దాని తీవ్రత ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారనడానికి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలకు అందని విధంగా విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ సాగింది.
విరాట్ కోహ్లీ ఇచ్చిన లైఫ్‌తో
ఒకే బ్యాట్స్‌మెన్‌కు రెండుసార్లు లైఫ్ ఇచ్చాడతను. ఆ రెండింట్లో ఏ ఒక్క దాన్నయినా అందుకుని ఉన్నా.. మ్యాచ్ ఫలితం వేరుగా ఉండేది. కోహ్లీ ఇచ్చిన లైఫ్ తరువాత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేప్టెన్ కేఎల్ రాహుల్ విశ్వరూపాన్ని చూపాడు. తొమ్మిదంటే తొమ్మిది బంతులను మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 42 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో తన సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు. 132 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 83 పరుగుల వద్ద ఒకసారి.. 89 పరుగుల వద్ద మరోసారి ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను కోహ్లీ మిస్ చేశాడు. దాని ప్రభావం జట్టు గెలుపోటములపై పడింది. పంజాబ్ టీమ్ స్కోర్ 200ల మార్క్‌ను దాటడానికి కారణమైంది.
17వ ఓవర్‌లో
బెంగళూరు స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ 17వ ఓవర్ అయిదో బంతిని సిక్స్ కొట్టి ఊపు మీదున్న కేఎల్ రాహుల్.. ఆ తర్వాత స్టెయిన్ వేసిన ఓ లో-ఫుల్ టాస్‌ను కూడా సిక్సర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది బాల్. కాస్త కష్టమే అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ దాన్ని డ్రాప్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. దాన్ని నేలపాలు చేశాడతను. అప్పటికి రాహుల్ వ్యక్తిగత స్కోర్ 83. అలా రాహుల్‌కు మొదటి లైఫ్ ఇచ్చాడు. అది అక్కడితో ఆగలేదు.
18వ ఓవర్‌లోనూ
నవదీప్ షైనీ వేసిన 18వ ఓవర్‌లోనూ రాహుల్‌కు ప్రాణదానం చేశాడు విరాట్. ఆ ఓవర్ చివరి బంతిని లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్‌కు యత్నించిన రాహుల్.. బంతిని గాల్లోకి లేపాడు. కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వెళ్లిన విరాట్ కోహ్లీ.. తేలికైన క్యాచ్‌ను వదిలేశాడు. అప్పటికి రాహుల్ స్కోరు 89 పరుగులు. ఈ రెండు లైఫ్‌ల తరువాత రాహుల్ మరింత రెచ్చిపోయాడు. విధ్వంసాన్ని సృష్టించాడు. తాను ఆడిన చివరి తొమ్మిది బంతుల్లో 42 పరుగులు చేశాడు. స్టెయిన్ వేసిన 19వ ఓవర్లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసమే సృష్టించాడు. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఏకంగా 26 రన్స్ పిండుకున్నాడు. ఈ వ్యవహారం కాస్తా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కోహ్లీని చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్స్.


Click it and Unblock the Notifications












