Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్‌ టీమ్‌ను మట్టికరిపించిన కేఎల్ రాహుల్..ఎనీ డౌట్స్

 IPL 2020: KXIP Vs RCB: KL Rahul Beats RCB by 23 Runs

దుబాయ్: నిజమే. 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మొత్తాన్నీ మట్టికరిపించాడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కేప్టెన్ కేఎల్ రాహుల్. అందేటీ? 97 పరుగుల తేడాతో కదా కింగ్స్ ఎలెవెన్ గెలిచిందీ అనే అనుమానాలు తలెత్తవచ్చు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే- కేఎల్ రాహుల్ చేసిన 132 పరుగుల వ్యక్తిగత స్కోరును కూడా అందుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్. టీమ్ మొత్తం కలిపినా కూడా కేఎల్ రాహుల్ ఒక్కడే చేసిన స్కోరు దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది. ఈ లెక్కన చూసుకుంటే..కేప్టెన్ ఒక్కడే తన ప్రత్యర్థి జట్టును ఖంగు తినిపించినట్టయింది.

రాయల్స్.. రాయల్‌గా పరాజయం

రాయల్స్.. రాయల్‌గా పరాజయం

ఐపీఎల్‌-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా గురువారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 97 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 109 పరుగులకే కుప్పకూలిపోయింది. కనీసం ప్రతిఘటించనూ లేదు. పంజాబ్ టీమ్ కేప్టెన్ ఒక్కటే 132 పరుగులు చేస్తే.. ఆ బెంచ్ మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది కోహ్లీసేన. 23 పరుగుల దూరంలో ఆగిపోయింది.

చెలరేగిన పంజాబ్ స్పిన్నర్లు..

చెలరేగిన పంజాబ్ స్పిన్నర్లు..

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ స్పిన్నర్లు మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌ ధాటికి బెంగళూరు టీమ్ తునాతునకలైంది. వారిద్దరూ కలిసి ఆరు వికెట్లను పడగొట్టారు. చెరీ సగం వికెట్లను పంచుకున్నారు. పేస్ బౌలర్లు షెల్డన్ కాట్రెల్, మహ్మద్ షమీ వారికి తోడయ్యారు. కాట్రెల్-3, షమీ ఒక వికెట్ పడగొట్టారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు రాయల్ ఛాలెంజర్స్ మంత్రం ఫలించలేదు. తల వంచక తప్పలేదు. పంజాబ్ బౌలర్ల దెబ్బకు బెంగళూరు 109 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.

 వన్ మ్యాన్ షో..

వన్ మ్యాన్ షో..

ఈ మ్యాచ్ మొత్తం కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో గా సాగిందనడంలో అనుమానాలు అక్కర్లేదు. బ్యాటింగ్‌లో చెలరేగిపోయి ఆడిన రాహుల్.. కేప్టెన్సీగా అద్భుతంగా రాణించాడు. తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఏ బౌలర్‌ను ఎలా? ఎక్కడ? వినియోగించాలో.. అక్కడ వినియోగించుకున్నాడు. ఇన్నింగ్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు పడటంతో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ ఒత్తిడిని కొనసాగింపజేయడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. ఏ ఒక్క బౌలర్‌నూ ధీటుగా ఎదుర్కొనలేకపోయారు బెంగళూరు బ్యాట్స్‌మెన్లు. స్వేచ్ఛగా ఆడలేకపోయారు.

మెరుపు సెంచరీ..

మెరుపు సెంచరీ..

తన దూకుడుతో రాహుల్.. రికార్డులను బద్దలు కొట్టాడు. రెండువేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్‌ను వెనక్కి నెట్టాడు. అతని 132 రన్స్‌ను నాలుగు భాగాలుగా చేసి చూస్తే.. తొలి 30 పరుగులను చేయడానికి 23 బంతులను ఎదుర్కొన్న రాహుల్.. ఆ సంఖ్యను దాటనే లేదు. మలి 30 పరుగుల కోసం 19 బంతులను తీసుకున్నాడు. 18 బంతుల్లో మూడో 30 పరుగులను సాధించాడు. ఇక తను ఎదుర్కొన్న చివరి తొమ్మిది బంతుల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. పరుగుల వరదను పారించాడు. తాను ఎదుర్కొన్న చివరి తొమ్మిది బంతుల్లో ఏకంగా 42 రన్స్ బాది అవతల పారేశాడు.

Story first published: Friday, September 25, 2020, 10:26 [IST]
Other articles published on Sep 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+