యూనివర్సెల్ బాస్ ఎంట్రీ: తొలి మ్యాచ్: పంజాబ్ విధాత..తలరాత మారుస్తాడా?: ఆర్సీబీకి దబడిదిబిడే

షార్జా: క్రిస్ గేల్.. క్రికెట్ ప్రేమికులకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. యూనివర్సెల్ బాస్. టీ20 ఫార్మట్‌లో 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న క్రికెటర్. ఈ మధ్యకాలంలో ఫామ్‌లో లేడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. అయినప్పటికీ.. ఈ కరేబియన్ కింగ్ మీదు ఉన్న ఆశలు.. ఆకాశమంత. ఒక్కసారి క్రీజ్‌లో నిలదొక్కుకుంటే.. సుడిగాలి వంటి ఇన్నింగ్‌ను అలవోకగా ఆడేయగలడు. క్రీజ్‌లో ఉన్నంత సేపూ బౌలర్ల మీద సునామీలా విరుచుకుపడే క్రిస్ గేల్.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రస్తుతం అందరి ఫోకస్ అతని మీదే ఉంటోంది.

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లే..
క్రిస్‌గేల్.. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏడు మ్యాచ్‌ల ఫస్ట్ స్పెల్ ముగిసింది. ఈ ఏడింట్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పంజాబ్ జట్టు గెలవగలిగింది. వరుస పరాజయాలను చవి చూస్తోంది. పాయింట్ల పట్టికలో అట్టుడుగు స్థాయిలో ఉంది. ప్లేఆఫ్ ఆశలను దూరం చేసుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఆడిన ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించలేకపోతోంది కేెఎల్ రాహుల్ టీమ్.

క్రిస్ గేల్ ఎంట్రీ..
ఈ పరిస్థితుల్లో క్రిస్ గేల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గురువారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. తుది జట్టులో ఇప్పటికే అతని స్థానం ఖాయమైంది. టోర్నమెంట్ ఆరంభం నుంచీ అతను ఫిట్‌గా ఉండట్లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడుకునే లోపే ఫుడ్ పాయిజన్‌కు గురయ్యాడు. ఆసుపత్రిలో చేరాడు. మూడు రోజుల కిందటే అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. బరిలోకి దిగడానికి ఉవ్విళ్లూరుతున్నాడు.

వారంరోజుల విరామం..
వారంరోజల విరామం తరువాత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు..సెకెండ్ స్పెల్‌లోకి దిగింది. ఈ స్పెల్‌లో తొలి మ్యాచ్‌ను ఆడబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును పంజాబ్ ఎలా ఎదుర్కొంటోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రిస్ గేల్ రాక.. జట్టును బలోపేతం చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడుతుంది. పార్ట్‌టైమ్ బౌలర్‌గా వికెట్లను పడగొట్టే సత్తా క్రిస్ గేల్‌కు ఉంది.

పంజాబ్‌దే పైచేయి..
ఐపీఎల్ టోర్నమెంట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ టీమ్ మెరుగైన రికార్డను కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా 25 సార్లు తలపడ్డాయి. ఇందులో డజను సార్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. 13 సార్లు పంజాబ్ పైచేయిని నమోదు చేసింది. ఈ సీజన్‌లో బెంగళూరు టీమ్ అద్భుతంగా ఆడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లను ఆడిన కోహ్లీ సేన అయిదింట్లో జయకేతనాన్ని ఎగురవేసింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరుతో పోల్చుకుంటే.. పంజాబ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. ఏడింట్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపు రుచి చూసింది. వరుస పరాజయాలతో కుదలైంది. ఈ పరిస్థితుల్లో క్రిస్ గేల్ ఆడబోతోండటం వల్ల.. ఆ జట్టు తలరాత మారుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications