కార్తీక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్:
ఐపీఎల్ 2020లో కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడం ఇదే తొలిసారి. చాలాకాలం తర్వాత కార్తీక్ బ్యాట్ జులిపించాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న కార్తీక్..అందరికి సమాధానం చెబుతూ 29 బంతుల్లో 58 పరుగులు చేశాడు. కార్తీక్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంటే అతడు సాధించిన పరుగుల్లో 44 పరుగులు ఫోర్లు, సిక్స్‌లు రూపంలో వచ్చినవే. డీకే ఈరోజు ఇంతటి మంచి ఇన్నింగ్స్ ఆడతాడని మ్యాచ్‌కు ఎవరూ ఊహించకపోయారు. దీంతో అందరూ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అటు మాజీలు, ఇటు ఫ్యాన్స్.

ఏం బ్రేక్ ఫాస్ట్ చేశావ్ కార్తీక్:
టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనయుడు, భారత మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ కూడా దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. 'గుడ్ ఆఫ్టర్‌నూన్ దినేశ్ కార్తీక్. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు. ఈరోజు బ్రేక్ ఫాస్ట్ ఏం చేసి మ్యాచ్‌కు సిద్ధమయ్యావ్. నాకు తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది' అని రోహన్ గవాస్కర్ ట్వీట్ చేశాడు. నువ్ ఆడింది అసాధారణమైన ఇన్నింగ్స్ అని కార్తీక్‌పై ప్రశంసలు కురిపించాడు.

తొలి వికెట్‌కు 115 పరుగులు:
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనకు దిగిన పంజాబ్‌కు అదిరే ఆరంభం దక్కింది. ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో మయాంక్ అగర్వాల్ (56; 39 బంతుల్లో, 6×4, 1×6) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కేఎల్ రాహుల్ (74; 58 బంతుల్లో, 6×4) కూడా మెరవడంతో పవర్‌ప్లేలో 47 పరుగులు సాధించింది. అనంతరం కార్తిక్ బౌలర్లను మారుస్తున్నా పరుగులు రాబట్టారు. 10వ ఓవర్ తర్వాత గేర్ మార్చిన వీరిద్దరు 13వ ఓవర్లో స్కోరును 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలో 33 బంతుల్లో మయాంక్, 42 బంతుల్లో రాహుల్ అర్ధ శతకాలు అందుకున్నారు. అయితే దూకుడు ఆడే క్రమంలో 15వ ఓవర్‌లో మయాంక్ ఔటవ్వడంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన నరైన్:
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పూరన్ (16; 10 బంతుల్లో, 4×2, 1×6) కూడా బ్యాట్ ఝుళిపించడంతో విజయానికి కావాల్సింది 18 బంతుల్లో 22 పరుగులే. అయితే సునీల్ నరైన్.. పూరన్‌ను బౌల్డ్ చేసి 18వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చాడు. తర్వాతి ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ.. సిమ్రన్ (4; 7 బంతుల్లో), రాహుల్‌ను ఔట్ చేసి 6 పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో ఆఖరి 6 బంతుల్లో పంజాబ్‌కు 14 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆఖరి ఓవర్‌లో నరైన్ 11 పరుగులే ఇచ్చి మన్‌దీప్‌ను ఔట్ చేశాడు. ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవ్వగా.. మాక్స్‌వెల్ బౌండరీ సాధించాడు.


Click it and Unblock the Notifications












