Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs KKR: ఫన్నీ రనౌట్.. ఒకే ఎండ్‌లోకి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు!!

IPL 2020, KXIP vs KKR: Nitish Rana and Shubman Gill involved in massive mix-up in IPL 2020

అబుదాబి: షేక్ జాయెద్ స్టేడియం వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్‌గా బరిలో దిగిన యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అతనికిది ఆరో అర్ధ శతకం కావడం విశేషం. మరోవైపు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నితీశ్ రాణా ఫన్నీగా రనౌట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి నిరాశపర్చాడు. క్రీజ్‌లో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన త్రిపాఠి.. ఎదుర్కొన్న 9వ బంతికి ఫోర్ బాది పరుగుల ఖాతా తెరిచాడు. కానీ ఆ మరుసటి బంతికే ఔట్ అయ్యాడు. మొహమ్మద్ షమీ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. త్రిపాఠి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ రాణా.. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.

ఒకే ఎండ్‌లోకి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు:

ఒకే ఎండ్‌లోకి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు:

అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. నితీష్ రాణా సింగిల్ కోసం వేగంగా పరుగెత్తాడు. ముందు పరుగు కోసం ప్రయత్నించిన గిల్.. బంతి షమీ దగ్గరకు వెళ్లడంతో క్రీజ్‌లోకి వచ్చేశాడు. ఇదేమీ గమనించని రాణా.. నాన్‌ స్ట్రయికర్ ఎండ్ నుంచి స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్ళిపోయాడు. షమీ బంతిని స్ట్రయికర్ ఎండ్ వికెట్లకు విసిరినా.. అది తగలకుండా నికోలస్ పూరన్ చేతుల్లో పడింది. అర్షదీప్ బంతి విసరమని అరుస్తున్నా.. పూరన్ పరుగెత్తుకుంటూ వెళ్లి వికెట్లను గిరాటేశాడు. ఇంకేముంది రాణా నిరాశగా పెవిలియన్ చేరాడు.

 4 బంతులు 2 రన్స్:

4 బంతులు 2 రన్స్:

ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఒకే ఎండ్‌లోకి చేరడంతో.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని నితీష్ రాణా ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ తప్పిదంతో 4 బంతులు ఆడి 2 రన్స్ మాత్రమే చేసిన రాణా.. పెవిలియన్ చేరాడు. ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉన్నప్పుడు ఇలా ఫన్నీగా రనౌట్ కావడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురి చేసింది. ఐపీఎల్ 2020లో 19 రనౌట్లు కాగా.. అందులో ఏడు రనౌట్లు పవర్ ప్లేలో చోటు చేసుకోవడం గమనార్హం.

రెండో అత్యల్ప స్కోరు:

రెండో అత్యల్ప స్కోరు:

కీలక 2 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా పరుగులు చేయడంలో పూర్తిగా నిరాశపరిచింది. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 25 రన్స్ మాత్రమే చేసింది. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్‌పైనే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 23 రన్స్ చేసింది. అయితే 10 ఓవర్ల తర్వాత కోల్‌కతా వేగంగా రన్స్ రాబట్టింది. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

Story first published: Saturday, October 10, 2020, 17:32 [IST]
Other articles published on Oct 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+