KXIP vs KKR: వాటే మ్యాచ్.. కోల్‌కతా బౌలర్లు సూపర్.. మళ్లీ ఓడిన పంజాబ్!!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత మారట్లేదు. గెలిచే మ్యాచును కూడా చేజేతులారా పోగొట్టుకుంది. కేకేఆర్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ ఛేదనలో పంజాబ్ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. కేవలం రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది. ఆశలు వదులుకున్న స్థితి నుంచి అసాధారణ పోరాటం చేసిన కోల్‌కతా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి ఓవర్‌కు 14 పరుగులు అవసరమవ్వగా.. మన్‌దీప్ సింగ్‌ను మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఔట్ చేసి 11 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 7 పరుగులు అవసరమవ్వగా.. క్రీజులో ఉన్న గ్లెన్ మాక్స్‌వెల్ (10) బౌండరీ సాధించాడు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. సరైన సమయంలో ప్రసిధ్ 3, నరైన్ 2 వికెట్లు తీసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ (74; 58 బంతుల్లో 6 ఫోర్లు) పోరాటం వృధా అయింది.

రాహుల్ హాఫ్ సెంచరీ:
లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రసిద్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను ఆండ్రీ రస్సెల్ వదిలేశాడు. ఈ అవకాశాన్ని రాహుల్ చక్కగా వినియోగించుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీల మోత మోగించాడు. ప్రసిద్ వేసిన నాలుగో ఓవర్‌లో రాహుల్ మూడు బౌండరీలు బాడీ పంజాబ్ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఆపై మయాంక్ కూడా వీలుచిక్కినపుడల్లా బౌండరీలు బాదాడు. ఇద్దరూ కోల్‌కతా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ 42 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఆపై మయాంక్ కూడా 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో పంజాబ్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

ఆరు బంతుల్లో 14 పరుగులు:
ధాటిగా ఆడే క్రమంలో మయాంక్ అగర్వాల్ (56 39 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) 15వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఆపై నికోలస్ పూరన్, రాహుల్ వేగంగా పరుగులు రాబట్టారు. 18వ ఓవర్లో పూరన్ (16) బోల్డ్ అయ్యాడు. ఇక కింగ్స్ పంజాబ్‌కు 14 పరుగులు అవసరం. 19 ఓవర్ ఆఖరి బంతికి రాహుల్‌ను ప్రసిద్ధ్ క్రిష్ణ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమైన సమయంలో మాక్స్‌వెల్ తొలి బంతికే రెండు పరుగులు సాధించాడు. తర్వాతి బంతి డాట్‌బాల్ కాగా.. మూడో బంతికి ఫోర్ రాబట్టాడు. నాలుగో బంతికి సింగిల్ తీయగా.. ఐదో బంతికి భారీ షాట్ ఆడిన మన్‌దీప్ బౌండరీ వద్ద ఫీల్డర్ చేతికి చిక్కాడు. ఆఖరి బంతికి ఏడు పరుగులు అవసరం కాగా.. మాక్స్‌వెల్ ఫోర్ కొట్టాడు. బంతి బౌండరీ లైన్‌కు కొన్ని ఇంచుల లోపల పడటంతో కోల్‌కతా గెలుపు ఖాయమైంది. పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టిన ప్రసిద్ కృష్ణ(3/29), నరైన్(2/28) కేకేఆర్‌కు ఊహించని విజయాన్నందించారు.

త్రిపాఠి విఫలం:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్ చేసిన రాహుల్ త్రిపాఠి (4; 10 బంతుల్లో, 1×4)ని మూడో ఓవర్‌లో మొహమ్మద్ షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్దిసేపటికే వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రాణా (2; 4 బంతుల్లో) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇయాన్ మోర్గాన్ (24; 23 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి శుభ్‌మన్ గిల్ (57; 47 బంతుల్లో, 4×5) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దూకుడుగా ఆడే యత్నంలో బిష్ణోయ్ బౌలింగ్‌లో మోర్గాన్ వెనుదిరిగాడు.

కార్తిక్ కెప్టెన్ ఇన్నింగ్స్:
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తిక్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. దూకుడుగా ఆడుతూ 22 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించాడు. అర్షదీప్ వేసిన 15వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన కార్తీక్.. జోర్డాన్ వేసిన తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. మరోవైపు గిల్ కూడా నిలకడగా ఆడుతూ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 13 ఓవర్లకు 75 పరుగులు చేసిన కోల్‌కతా.. ఆఖరి 7 ఓవర్లలో 89 పరుగులు సాధించింది. ఆండ్రీ రసెల్ (5) మరోసారి నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్షదీప్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications