KXIP vs KKR: గేల్ పంజాబ్ తలరాతను మార్చగలడు.. ఎందుకు ఆడించట్లేదు.. ఫాన్స్ ఫైర్

అబుదాబి: ఐపీఎల్-13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (57: 47 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (58: 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పంజాబ్ బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా పోరాడే స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.
కాట్రెల్ స్థానంలో జోర్డాన్:
ఈ మ్యాచ్‌లో కూడా యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బరిలో దింపలేదు. వరుస ఓటములతో పంజాబ్ సతమతం అవుతున్న వేళ.. కోల్‌కతాపై గేల్ ఆడటం ఖాయమని భావించారంతా. కానీ అలా జరగలేదు. గేల్‌ను పక్కన పెట్టిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. తుది జట్టులోకి ఫిట్‌గా లేని కాట్రెల్ స్థానంలో జోర్డాన్‌ను ఎంపిక చేసుకున్నాడు. నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనే గేల్ ఆడతాడని కోచ్ అనిల్ కుంబ్లే ప్రకటించాడు. కానీ ఫుడ్ పాయిజనింగ్ కావడంతో చివరి నిమిషంలో అతణ్ని తీసుకోలేకపోయామని తెలిపాడు.
పంజాబ్ తలరాతను మార్చగలడు:
వరుస ఓటముల ఎదురవుతున్నా.. క్రిస్ గేల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బరిలో దింపకపోవడంపై ఫాన్స్ మండిపడుతున్నారు. ఎందుకు గేల్‌ను తీసుకోలేదంటూ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతణ్నే తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. గేల్ పంజాబ్ తలరాతను మార్చగలడు.. ఎందుకు ఆడించట్లేదు అని ఓ అభిమాని మండిపడ్డాడు. 'పంజాబ్ పాయింట్ల పట్టికలో చివరలో ఉంది. అయినా గేల్ లాంటి మంచి ఆటగాడిని ఎందుకు అండించట్లేదు. గేల్ పంజాబ్ తలరాతను మార్చగలడు' అని మరో అభిమాని ట్వీట్ చేశాడు.
గేల్‌ను ఎందుకు ఆడించట్లేదు:
ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 48 రన్స్ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆడిస్తూ.. క్రిస్ గేల్‌ను ఎందుకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడం లేదని మార్ అభిమాని పంజాబ్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. గేల్ లేకపోవడం వల్లే పంజాబ్ గెలవలేకపోతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చెన్నై, ముంబై ఇండియన్స్ యాజమాన్యాలను చూసి నేర్చుకోండి.. టాలెంట్‌ను గుర్తించడంటూ ఫైర్ అవుతున్నారు. టాస్ సమయంలో మాట్లాడిన రాహుల్.. ఫిట్‌గా లేని కాట్రెల్ స్థానంలో జోర్డాన్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు చెప్పాడు కానీ గేల్ గురించి ఏమీ మాట్లాడలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications