KXIP: పంజాబ్‌ హ్యాట్రిక్‌.. గేల్‌కు స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చిన ప్రీతి జింటా (వీడియో)

దుబాయ్: వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళా విశేషమో కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో వరుస ఓటములతో చతికిలపడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్.. అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్‌ రేసులోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పంజాబ్ ప్లేఆఫ్స్‌ వెళ్లొచ్చు. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ .ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది.

హ్యాట్రిక్‌ సంబరాలు

ప్లేఆఫ్స్‌ వెళ్లడం కష్టమే అనుకున్న దశలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అనూహ్యంగా పుంజుకున్నది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ లాంటి అగ్రశ్రేణి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించిన రాహుల్‌సేన ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. ముంబైపై రెండో సూపర్ ఓవర్లో అద్భుత విజయాన్ని అందుకున్న పంజాబ్.. ఢిల్లీపై కూడా అదే జోరు కొనసాగించింది. ఢిల్లీ విజయం అనంతరం పంజాబ్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ బృందం, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ హ్యాట్రిక్‌ సంబరాలు చేసుకుంది.

గేల్‌కు స్పెషల్ గిఫ్ట్

గేల్‌కు స్పెషల్ గిఫ్ట్

డ్రెస్సింగ్‌ రూమ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌, పేసర్ షెల్డన్ కాట్రెల్‌, ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ, యూనివర్సల్ బాస్ క్రిస్ ‌గేల్‌ తదితరులుకు పంజాబ్‌ ఫ్రాంఛైజీ సహయాజమాని ప్రీతి జింటా స్పెషల్‌ గిఫ్ట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మాక్స్‌వెల్‌, గేల్‌లకు ‌ప్రీతి జింటా హాగ్ ఇచ్చారు. ఈ సమయంలో యూనివర్సల్ బాస్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆపై యువ ఆటగాళ్లతో కలిసి భాంగ్రా డ్యాన్స్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్‌ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

కోవిడ్ టెస్ట్ క్వీన్

కోవిడ్ టెస్ట్ క్వీన్

ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన కింగ్స్‌ లెవ‌న్ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా తాజాగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. తన దగ్గర్నుంచి కరోనా టెస్టు కోసం శాంపిళ్లను సేకరిస్తోన్న ఓ వీడియోను ప్రీతి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ తాను 20సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నానని వీడియోలో తెలిపారు. ఇలా టెస్టులు చేయించుకుని తాను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ప్రీతి చమత్కరించారు. అంతేకాదు కరోనా టెస్ట్ చేసిన ఒకామెను ప్రశంసించారు. ఆమె చాలా బెస్ట్ అని పొగిడారు.

IPL 2020,KXIP v DC Highlights: Kings XI Punjab Defeated Delhi Capitals By 5 Wickets|Oneindia Telugu
పట్టికలో ఐదో స్థానం

పట్టికలో ఐదో స్థానం

కింగ్స్‌ లెవ‌న్ పంజాబ్ ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పంజాబ్ ప్లేఆఫ్స్‌ వెళ్లొచ్చు. ఒక్కటి ఓడినా మాత్రం మిగతా జట్ల గణాంకాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు దాదాపు ప్లేఆఫ్స్‌ వెళ్ళినట్టే. ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్ పోటీలో ఉన్నాయి. హైదరాబాద్, కోల్‌కతా, రాజస్థాన్, చెన్నై జట్లతో పంజాబ్ తదుపరి మ్యాచులు ఆడాల్సి ఉంది.

'బ్యాటింగ్‌ ఎంచుకుని తప్పుచేశాం.. అప్పుడే మ్యాచ్‌ మా నుంచి చేజారిపోయింది'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 22, 2020, 16:33 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X