Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB: మూడు వికెట్లతో చెలరేగిన మహ్మద్‌ సిరాజ్.. కోల్‌కతా స్కోర్ 40/6

IPL 2020, KKR vs RCB: Mohammed Siraj gets 3wickets, Kolkata woes in Abu Dhabi

అబుదాబి: ఐపీఎల్‌ 2020లో అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతన్న మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సిరాజ్‌ తన అద్భుత పేస్ బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ను గడగడలాడించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. ఆపై స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో కోల్‌కతా 40 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి కోల్‌కతా ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (1) ఔట్ అయ్యాడు. వికెట్‌ కీపర్‌ ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి త్రిపాఠి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన ఫామ్ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా (0) బౌల్డ్‌ అయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో స్టార్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(1) కూడా ఔటయ్యాడు. రెండో బంతిని భారీ షాట్‌ ఆడగా మిడాన్‌లో క్రిస్‌ మోరీస్‌ చేతికి చిక్కాడు. దీంతో మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

మహ్మద్‌ సిరాజ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మన్‌ టామ్‌ బాంటన్ ‌(10) కూడా కీపర్‌ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ సమయంలో ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఐదు ఓవర్ల పాటు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. అయితే పరుగులు మాత్రం చేయలేకపోయారు. దీంతో స్కోర్ వేగం బాగా తగ్గిపోయింది. కార్తీక్ 14 బంతుల్లో 4 పరుగులే చేశాడు. తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి కార్తీక్ ఔట్ అయ్యాడు. చహల్ బౌలింగ్లో కార్తీక్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

ఈ దశలో కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. బెంగళూరు బౌలర్ల ధాటికి ప్యాట్ కమ్మిన్స్ కూడా పరుగులు చేయలేకపోయాడు. చివరికి 13వ ఓవర్ మూడో బంతికి చహల్ బౌలింగ్లో కమ్మిన్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 17 బంతుల్లో 4 పరుగులే చేశాడు. మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నాడు.

Story first published: Wednesday, October 21, 2020, 21:12 [IST]
Other articles published on Oct 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+