KKR vs MI: ఎంఎస్ ధోనీ ఏడేళ్ల రికార్డును సమం చేసిన ప్యాట్ కమిన్స్‌!!

దుబాయ్: కెప్టెన్‌ మారినా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)‌ రాత మాత్రం మారలేదు. బ్యాటింగ్‌లో వైఫల్యం, బౌలింగ్‌లో అలసత్వం కొనసాగించిన కోల్‌కతా మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేయగా.. కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ (29 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.

ధోనీ రికార్డు సమం

ధోనీ రికార్డు సమం

ముంబై బౌలర్ల ధాటికి కోల్‌కతా 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ప్యాట్ కమిన్స్‌ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం చేశాడు. 36 బంతుల్లో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇయాన్ మోర్గాన్‌తో కలిసి ఏడవ వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. కమిన్స్‌ హాఫ్ సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ 2013 ఫైనల్లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహీ ముంబైపై అర్ధ సెంచరీ సాధించాడు. ఏడేళ్ల అనంతరం కమిన్స్‌ హాఫ్ సెంచరీ బాదాడు.

స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ల కంటే ఎక్కువ పరుగులు:

స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ల కంటే ఎక్కువ పరుగులు:

పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ల కంటే ఎక్కువ పరుగులు చేయడం విశేషం. ఈ సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌లలో 126 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ (8 ఇన్నింగ్స్‌లలో 119), ఆండ్రీ రసెల్ (7 ఇన్నింగ్స్‌లలో 83)ల కంటే ముందున్నాడు. కింగ్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన గ్లెన్ మాక్స్ వెల్ (7 ఇన్నింగ్స్‌లలో 58), రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాడు రాబిన్ ఉత్తప్ప (6 ఇన్నింగ్స్‌లలో 83), చెన్నై సూపర్ కింగ్స్ కేదర్ జాదవ్ (4 ఇన్నింగ్స్‌లలో 58)ల కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. అంతేకాదు ఎంఎస్ ధోనీ, గ్లెన్ మాక్స్ వెల్, రిషబ్ పంత్, ఆండ్రీ రసెల్ మొదలైన వారి కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు.

నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌కే మోర్గాన్‌ పరిమితం:

నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌కే మోర్గాన్‌ పరిమితం:

టాస్‌ గెలిచిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకోగా.. కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి (7), శుభ్‌మన్‌గిల్‌ (21), నితీశ్‌ రాణా (5), దినేశ్‌ కార్తీక్‌ (4) నిరాశ పరిచారు. డేంజర్‌ మ్యాన్‌ రసెల్ (12) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఫలితంగా కోల్‌కతా 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కమిన్స్‌ వరుస బౌండ్రీలతో విజృంభించాడు. మోర్గాన్‌ను నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌కే పరిమితం చేస్తూ భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. చివర్లో మోర్గాన్‌ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో.. కేకేఆర్‌ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.

లయ అందుకుని:

లయ అందుకుని:

ఐపీఎల్-2020 సీజన్‌లో అత్యధిక ధరకు ( 15.5 కోట్లు) అమ్ముడుపోయిన ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్‌ తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. ముంబై మ్యాచులో మూడు ఓవర్లు మాత్రమే వేసిన ప్యాట్.. ఏకంగా 49 పరుగులను సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతని ఖాతాలో పడలేదు. అతని బౌలింగ్ ఆద్యంతమూ నాసిరకంగా కనిపించింది. దీంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాతి నుంచి లయ అందుకుని వికెట్ల వేట మొదలెట్టాడు. పరుగులు కూడా చేస్తున్నాడు.

RR vs RCB: బెంగళూరుతో రాజస్థాన్‌ ఢీ.. స్మిత్‌సేనకు చావోరేవో.. ప్రతీకారం తీర్చుకునేనా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 17, 2020, 14:00 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X