KKR vs MI: కెప్టెన్సీ నుంచి తప్పుకుని.. బ్యాటింగ్ ఇరగదీశావ్ దినేష్ కార్తీక్!!

హైదరాబాద్: కెప్టెన్‌ మారినా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)‌ రాత మాత్రం మారలేదు. బ్యాటింగ్‌లో వైఫల్యం, బౌలింగ్‌లో అలసత్వం కొనసాగించిన కోల్‌కతా మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. బౌలర్ ప్యాట్ కమిన్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేయడం విశేషం.

కెప్టెన్సీ వ‌దులుకున్న కార్తీక్‌:

కెప్టెన్సీ వ‌దులుకున్న కార్తీక్‌:

రెండున్నరేండ్లుగా కోల్‌కతా కెప్టెన్‌గా కొనసాగుతున్న దినేశ్‌ కార్తీక్..‌ శుక్రవారం మ్యాచ్‌కు ముందు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను జట్టు యాజమాన్యం కేకేఆర్‌ సారథిగా నియమించింది. బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్తీక్‌ పేర్కొన్నాడు. వరుస వైఫల్యాల కారణంగానే అతడిపై వేటు పడిందనే ఊహాగానాలు వినిపిసున్నాయి. కార్తీక్‌ నిరయాన్ని గౌరవిస్తున్నామని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఏదేమైనా కార్తీక్ మాత్రం సారథిగా తప్పుకున్నాడు.

దెబ్బకు బెయిల్ ఎగిరింది:

దెబ్బకు బెయిల్ ఎగిరింది:

బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాన్నానని చెప్పిన దినేశ్ కార్తీక్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోతాడని అంతా ఊహించారు. కానీ అలా జరగలేదు. పేలవ షాట్‌తో (4: 8 బంతుల్లో 1x4) స్పిన్నర్ రాహుల్ చహర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన చహర్.. రెండో బంతికి ఓపెనర్ శుభమన్ గిల్ (2) వికెట్ తీసి.. మూడో బంతికి కార్తీన్‌ని బోల్తా కొట్టించేశాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని కార్తీక్ స్వీప్ షాట్‌తో ఫైన్ లెగ్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ అంచు తాకిన బంతి.. కాళ్ల కింది నుంచి నేరుగా వెళ్లి స్టంప్‌ని గీరాటేసింది.

 అభిమానుల ఆగ్రహం:

అభిమానుల ఆగ్రహం:

దినేశ్ కార్తీక్‌కు మైదానం నలువైపులా పరుగులు చేయగల సామర్థ్యం ఉంది. ఇక స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్‌ని బాగా ఆడగలడు. కానీ రాహుల్ చహర్ విసిరిన బంతి సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. బంతి ఆఫ్ స్టంప్ లైన్‌పై పడుతుందని ఊహించి ముందే స్వీప్ షాట్‌కి సిద్ధమైపోగా.. చహర్ తెలివిగా ఆఫ్ స్టంప్‌కి దూరంగా విసిరాడు. దాంతో కార్తీక్ బంతిని ఊహించిన విధంగా కనెక్ట్ చేయలేకపోయాడు. వికెట్ పడిన వెంటనే కార్తీక్ సాహాసోపేత షాట్‌కి ప్రయత్నించి, కెప్టెన్సీ లేకున్నా కూడా సరిగా ఆడలేదు అని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

బ్యాటింగ్ ఇరగదీశావ్:

బ్యాటింగ్ ఇరగదీశావ్:

కీలక సమయంలో 8 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్‌.. 4 రన్స్ మాత్రమే చేయడంతో సోషల్ మీడియాలో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. 'కెప్టెన్సీ నుంచి తప్పుకుని.. బ్యాటింగ్ ఇరగదీశావ్ దినేష్ కార్తీక్', 'కెప్టెన్సీని వదులుకుని బాగా ఆడవు కార్తీక్', 'బ్యాటింగ్ ఆర్డర్ మార్చావ్, కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఏం సాధించావ్' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇయన్ మోర్గాన్, షారుక్ ఖాన్ మిమ్స్ కూడా ఫాన్స్ పోస్ట్ చేస్తూ ఫన్నీ కామెంట్లు రాస్తున్నారు.

DC vs CSK: అతడు బేబీ సెహ్వాగ్.. అచ్చం అలానే ఆడుతున్నాడు: గ్రేమ్ స్వాన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 17, 2020, 11:41 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X