Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs CSK: సునీల్ నరైన్‌పై వేటు.. ఇంగ్లండ్ సంచలన ఓపెనర్‌కు అవకాశం?!!

IPL 2020, KKR vs CSK: Tom Banton to replace Sunil Narine

అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. కోల్‌కతా మొదటి మ్యాచులో ఓడి.. వరుసగా రెండు విజయాలు అందుకుని రేసులోకి వచ్చింది. మళ్లీ నాలుగో మ్యాచులో ఓడడంతో కథ మొదటికే వచ్చింది. కోల్‌కతాకు ఓటములకు ప్రధాన కారణం సరైన ఓపెనింగ్ జోడీ లేకపోవడమే. మొదటి మ్యాచ్ నుంచి తాత్కాలిక ఓపెనర్ సునీల్ నరైన్ దారుణంగా విఫలమవుతున్నాడు. అయినా కూడా కెప్టెన్ దినేష్ కార్తీక్ అతడిపైనే నమ్మకం ఉంచాడు. కార్తీక్‌ తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు.

ఐపీఎల్ 2020లో నాలుగు మ్యాచ్‌లాడిన సునీల్ నరైన్ 6.75 సగటుతో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ రెండు వికెట్లే పడగొట్టాడు. నరైన్ విఫలమవుతుండంతో మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌పైనే ఒత్తిడి పడుతోంది. దీంతో కోల్‌కతా భారీ పరుగులు చేయడంలో విఫలమవుతోంది. దీంతో జట్టులో మార్పులు చేయాలని కోల్‌కతా యాజమాన్యం భావిస్తోంది. ఈరోజు చెన్నైతో మ్యాచ్‌కి నరైన్‌కి పక్కనపెట్టి.. అతని స్థానంలో ఇంగ్లండ్ సంచలన ఓపెనర్ టామ్ బాంటన్‌ని ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది.

గత డిసెంబర్ మాసంలో జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో 21 ఏళ్ల టామ్ బాంటన్‌ని రూ. 1 కోటికి అతడ్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. బాంటన్ విధ్వంసకర ఓపెనర్. మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయాలని చూస్తుంటాడు. క్రీజులో కుదురుకుంటే పరుగుల వరదే. బాంటన్ తుది జట్టులో ఉంటే.. కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ పటిష్టం కానుంది. బాంటన్ ఇంగ్లండ్ తరపున 6 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. వన్డేల్లో, టీ20ల్లో ఒక్కో హాఫ్ సెంచరీ బాదాడు.

ఇక సునీల్ నరైన్ ప్రొఫెషనల్ ఓపెనర్‌ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను ఎప్పుడూ ఓపెనర్‌గా ఆడలేదు. కోల‌్‌కతా నైట్‌రైడర్స్ ప్రయోగాత్మకంగా ఓపెనర్‌గా పంపింది. గత ఏడాది కొన్ని మ్యాచ్‌‌ల్లో అదరగొట్టడంతో ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఓపెనర్‌గా ఆడిస్తోంది. అయితే ఈ ఏడాది నరైన్ క్లిక్ కావడం లేదు. ఆరంభ ఓవర్లలోనే అతడ్ని అన్ని జట్లూ ఔట్ చేస్తున్నాయి. ఆరంభ ఓవర్లలోనే అతని వికెట్ కోల్పోవడంతో ఆ ప్రభావం జట్టుపై పడుతోంది.

ఐపీఎల్ 2020లో దినేశ్ కార్తీక్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. వరుస మ్యాచుల్లో (6, 1, 0, 30) తడబడుతున్నాడు. మరోవైపు బ్యాటింగ్‌ ఆర్డర్లోనూ అతను తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలివ్వడం లేదు. గౌతమ్ గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా విజయాల రేటు 56.48గా ఉండగా.. కార్తీక్‌ జట్టు పగ్గాలు అందుకున్నాక అది 51.52కు పడిపోయింది. దీంతో కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఆడుతాడో చూడాలి.

Story first published: Wednesday, October 7, 2020, 14:43 [IST]
Other articles published on Oct 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+