Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీకి అశ్విన్.. బదులుగా సుచిత్, రూ.1.5 కోట్లు!!

IPL 2020: Kings XI Punjab trades Ravichandran Ashwin to Delhi Capitals, gets Rs 1.5 crore and Jagadeesha Suchith

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-13లో జట్టు మారబోతున్నాడని వస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. అశ్విన్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు వదులకుంది. దీంతో రెండు సీజన్ల పాటు పంజాబ్‌ను కెప్టెన్‌గా నడిపించిన అశ్విన్‌.. తదుపరి సీజన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీలో కనిపించనున్నాడు.

బదులుగా సుచిత్, రూ.1.5 కోట్లు:

బదులుగా సుచిత్, రూ.1.5 కోట్లు:

ఐపీఎల్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో పద్ధతి ప్రకారం పంజాబ్,ఢిల్లీ జట్ల మధ్య గురువారం ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అశ్విన్‌ను వదులుకున్నందుకు పంజాబ్‌ జట్టుకు ఢిల్లీ యాజమాన్యం రూ. 1.5 కోట్ల నగదుతో పాటు స్పిన్నర్‌ జగదీశ సుచిత్‌ను బదిలీ చేయనుంది. ఇక ఢిల్లీ జట్టులో చేరిన అశ్విన్‌కు రూ. 7.6 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ట్రెంట్ బౌల్ట్‌ను కూడా కోరిన పంజాబ్:

ట్రెంట్ బౌల్ట్‌ను కూడా కోరిన పంజాబ్:

జగదీశ సుచిత్‌తో పాటు న్యూజిలాండ్‌ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను పంజాబ్‌ కోరినప్పటికీ.. చర్చలు సఫలం కాలేదు. ఈ విషయాన్ని పంజాబ్‌ ప్రాంఛైజీ సహ యజమాని నెస్‌ వాడియా వెల్లడించారు. 'అశ్విన్‌ ఒప్పందం పట్ల అందరూ సంతోషంగా ఉన్నాం. అశ్విన్‌తో పాటు ఢిల్లీ కూడా హ్యాపీగా ఉంది. జట్లతో సంప్రదింపుల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చాం' వాడియా పేర్కొన్నారు.

గతంలోనే ఒప్పందం:

గతంలోనే ఒప్పందం:

సీజన్-12 పూర్తయిన తర్వాత అశ్విన్‌ను బదిలీ చేయాలని నిర్ణయించుకున్న యాజమాన్యం.. పంజాబ్ జట్టులో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కలువడంతో నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే అశ్విన్‌కు బదులుగా ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ నుంచి తీసుకునేందుకు పంజాబ్ గతంలోనే ఒప్పందం కుదర్చుకుంది. దీంతో తాజాగా అశ్విన్ బదిలీపై పంపాలని పంజాబ్ నిర్ణయించుకుంది. చర్చలు సఫలం అయ్యాయి.

కెప్టెన్‌గా విఫలం:

కెప్టెన్‌గా విఫలం:

2018లో కెప్టెన్‌గా పంజాబ్ జట్టు పగ్గాలు అందుకున్న అశ్విన్.. 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక కెప్టెన్‌గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. గత సీజన్‌లో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో నిలిచింది. మాన్కడింగ్ లాంటి వివాదంలో కూడా ఇరుక్కున్నాడు.

పంజాబ్ కెప్టెన్‌గా రాహుల్:

పంజాబ్ కెప్టెన్‌గా రాహుల్:

అశ్విన్ ఢిల్లీ జట్టుకు వెళుతుండడంతో పంజాబ్ కెప్టెన్‌గా భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. పంజాబ్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నా.. జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. గత కొన్ని సీజన్‌లుగా రాహుల్ పంజాబ్ జట్టు తరపునే ఆడడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. ఇక అధికారిక ప్రకటన రావడమే మిగిలుంది.

Story first published: Friday, November 8, 2019, 9:06 [IST]
Other articles published on Nov 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+