Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ విలియమ్సన్‌కు గాయం: రాజస్థాన్‌తో కీలక మ్యాచ్‌ కోసం: తుదిజట్టులో మరో హిట్టర్?

IPL 2020: Kane Williamson likely to play against Rajasthan Royals tonight at Dubai?

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో మరో కీలక ఆటగాడు గాయపడ్డాడు. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ ఆడటంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కీలకమైన మ్యాచ్ కావడం వల్ల అతణ్ని తుదిజట్టులోకి తీసుకోవడానికే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తోన్న కేన్ విలియమ్సన్ తుదిజట్టులోకి తీసుకోవడంతో పాటు మహ్మద్ నబీని ఆడించే అవకాశం ఉంది.

ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే..?

ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే..?

ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా గురువారం సాయంత్రం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు జట్లూ తలపడబోతున్నాయి. ఈ రెండింటికీ ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. జీవన్మరణ సమస్యగా తయారైంది. ఏ జట్టు ఓడిపోయినా.. ప్లేఆఫ్ ఆశలకు దూరమౌతుంది.

అట్టడుగు జట్ల మధ్య ఫైట్..

అట్టడుగు జట్ల మధ్య ఫైట్..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కూడా చివరి స్థానాల్లో నిల్చున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోల్చుకుంటే రాజస్థాన్ టీమ్ పరిస్థితి కొంతలో కొంత మెరుగు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో రాజస్థాన్ జట్టు ఆరో స్థానంలో ఉంది. హైదరాబాద్ టీమ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్‌లో పది మ్యాచ్‌లను ఆడిన రాజస్థాన్ జట్టు నాలుగు విజయాలను సాధించింది. ఎనిమిది పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.

భారీ నెట్ రన్‌రేట్..

భారీ నెట్ రన్‌రేట్..

తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన హైదరాబాద్.. ఆరు మ్యాచుల్లో పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. రాజస్థాన్ టీమ్.. చివరి అయిదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచింది. చివరి అయిదు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకూ కీలకమైనదే హైదరాబాద్ గెలిస్తే.. ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానం నుంచి పైకి ఎగబాకడం ఖాయం అవుతుంది. భారీ తేడాతో గనక విజయాన్ని అందుకోగలిగితే..పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజస్థాన్ పరిస్థితీ దాదాపుగా అంతే.

కేన్ ఆడతాడా?

కేన్ ఆడతాడా?

ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఆడతాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. హేమ్‌స్ట్రింగ్ గాయంతో అతను బాధపడుతున్నాడు. గాయంతోనే అతను ఆ మ్యాచ్‌లో ఆడాడు. ఈ గాయం నయమైందనే సంకేతాలను ఇస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్. కేన్ విలియమ్సన్ నెట్‌లో ముమ్మరంగా ప్రాక్టిస్ చేస్తోన్న కొన్ని ఫొటోలను తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ నబీని ఆడించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

Story first published: Thursday, October 22, 2020, 14:14 [IST]
Other articles published on Oct 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+