'ఈ క్షణం కోసం రెండేళ్లుగా వేచిచూస్తున్నా.. ఇక ఆగలేను'

అబుదాబి: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచ్‌లు సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్నాయి. టోర్నీ తేదీలు ఖరారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ 24 గంటల్లో అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కావడానికి 20 రోజుల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్ ముగించుకుంటున్నాయి. కొన్ని జట్లు దుబాయ్‌లో ఉండగా, మరికొన్ని జట్లు అబుదాబిలో ఉన్నాయి.

మరో వారం క్వారెంటైన్‌లోనే:
దుబాయ్‌లో బస చేస్తున్న జట్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ క్వారెంటైన్ సమయాన్ని పూర్తి చేసుకోగా.. ఢిల్లీక్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ గడువు శనివారంతో ముగుస్తుంది. ఇప్పటికే చెన్నై, ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్ జట్లు ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇక అబుదాబికి వెళ్లిన ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మరో వారం రోజులు క్వారెంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా:
క్వారెంటైన్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు కొందరు గురువారం పలు వీడియోల్లో మాట్లాడారు. టీమిండియా ఏ క్రికెటర్ కమలేశ్ నాగర్‌కోటి మాట్లాడుతూ... 'ఈసారి ఐపీఎల్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే.. దీని కోసం రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా. చివరికి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనెంతో ఆనందంగా ఉన్నా. గాయాల కారణంగా ఇంతకుముందు సీజన్లలో ఆడలేకపోయా. తర్వాత ముంబైలో ఎంతో కష్టపడి సాధన చేశాను. మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై మా సహాయక సిబ్బందిని ఎప్పటికప్పుడు సంప్రదించా' అని తెలిపాడు.

అవకాశం వస్తే:
'ఏడాది కాలంగా ఆటకు దూరమయ్యా. ఆ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా ఉండే అవకాశం దొరికింది. ఇంతకుముందు పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇప్పుడు అది కూడా ప్రారంభించా. ఇంట్లోనే శారీరక వ్యాయామాలు కూడా సాధన చేశా. ఇప్పుడు కోల్‌కతాకు బౌలింగ్ చేసే అవకాశం వస్తే.. తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తా. కేకేఆర్ తరఫున ఆడటం కోసం ఆసక్తిగా ఉన్నా' అని కమలేశ్ నాగర్‌కోటి పేర్కొన్నాడు. 2018లోనే కోల్‌కతా కు ఎంపికైనా కమలేశ్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications