Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌.. ఆరేళ్ల క్రితమే ఆర్చర్ జోస్యం!!

IPL 2020: Jofra Archer’s 6 years old tweet goes viral on Joe Biden over US Elections


దుబాయ్: ఇంగ్లండ్ స్టార్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన బౌలింగ్‌తోనే కాదు ట్వీట్ల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్చర్‌ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో.. అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్‌లో ఏది జరిగినా.. ఆర్చర్‌ ముందే చెప్పాడనే ట్వీట్‌ మన ముందు నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది మాత్రం ఆర్చర్‌కే తెలియాలి. కేవలం క్రికెట్‌పైనే కాకుండా రాజకీయాలపై కూడా ఆర్చర్‌ జోస్యం చెప్పడం.. అది నిజమవడం జరిగింది. అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆర్చర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది.

ఆరేళ్ల క్రితమే జోస్యం:

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదనే ప్రశ్నను 2-3క్రితం అడిగినా గెలిచేదెవరో చెప్పలేని పరిస్థితి. కానీ జో బైడెన్‌ అధ్యక్షుడు అవుతాడని రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆరేళ్ల క్రితమే జోస్యం చెప్పాడు. ఈ విషయాన్ని 2014 అక్టోబర్‌ 4నే అతడు ట్వీట్‌ చేశాడట. కేవలం జో అనే పదాన్నే ఆర్చర్ ట్వీట్ చేశాడు. అతడు చెప్పింది బిడెన్ గురించే అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఆర్చర్ పోస్ట్‌ చేసిన 'జో' అనే ట్వీట్‌ను రాజస్థాన్‌ జట్టు కూడా రీట్వీట్‌ చేసింది.

కరోనాకు టీకా ఎప్పుడొస్తుంది:

కరోనాకు టీకా ఎప్పుడొస్తుంది:

జో బైడెన్‌కు సంబందించిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జోఫ్రా ఆర్చర్ ట్వీట్‌పై కొందరు ఫ్యాన్స్ షాక్ అవుతుండగా.. నిజంగానే ఆర్చర్‌ వద్ద టైమ్‌ మిషీన్‌ ఉందా అని మరికొందరు అంటున్నారు. తమ ఫేవరేట్ సినిమా రాబోయే సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పాలని, కరోనాకు టీకా ఎప్పుడొస్తుందో చెప్పాలని ఆర్చర్‌ను నెటిజన్లు కోరుతున్నారు. ఆర్చర్‌ను నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటుంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి.

 ఏబీ సో స్పెషల్:

ఏబీ సో స్పెషల్:

క్రిస్ ‌గేల్‌ 99 పరుగుల వద్ద ఔట్‌, ప్రధాని 21 రోజుల లాక్‌డౌన్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్‌, వరుసగా 4 సిక్సులు, ఒకే ఓవర్లో 30 పరుగులు ఇలా ఆర్చర్‌ చేసిన ట్వీట్‌లు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌పై 22 బంతుల్లో 55 రన్స్ చేసిన డివిలియర్స్.. బెంగళూరును గెలిపించాక 'ఏబీ సో స్పెషల్' అని 2015లో ఆర్చర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

 తనపై కూడా జోస్యం:

తనపై కూడా జోస్యం:

ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ముంబై‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్‌ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్‌ త్యాగి వేసిన 11 ఓవర్‌ నాల్గో బంతిని భారీ షాట్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌.. బౌండరీ లైన్‌కు కాస్త ముందు ఆర్చర్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్‌ దాన్ని అందుకున్నాడు. అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్‌లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్‌ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్‌ ఒక ట్వీట్‌ చేశాడు. 'క్యాచ్‌ ఆఫ్‌ ది ఐపీఎల్‌' అని ఆర్చర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తన జోస్యాన్ని కూడా ఆర్చర్ ముందే చెప్పుకున్నాడు.

నంబర్స్‌తో కోహ్లీ ప్రదర్శనను నిర్ణయించలేం.. అతడి సేవలు బెంగళూరుకు అవసరం: కటిచ్‌

Story first published: Sunday, November 8, 2020, 21:21 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+