కోల్‌కత..చేతులు కాల్చుకుంటోందా?: మిడ్ సీజన్ ప్రయోగాలతో అసలుకే ఎసరు వచ్చేలా ఉందే?

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో అత్యల్ప స్కోరు నమోదైంది. ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సింగిల్ హ్యాండ్‌తో చేయగల స్కోర్ అది. కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్‌ 20 ఓవర్లను ఆడినా మూడంకెలను కూడా అందుకోలేకపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుధాబిలో బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్ 84 పరుగులకే కుప్పకూలిపోయింది. స్కోర్ బోర్డుపై ఆ మాత్రం పరుగులు జమ చేయడానికి కోల్‌కత టీమ్ 20 ఓవర్లను తీసుకోవాల్సి వచ్చింది. ఎనిమిది వికెట్లను కోల్పోయింది.

తక్కువ పరుగులకే

తక్కువ పరుగులకే

అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 84 పరుగులను మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులను సంధించారు. కోల్‌కత టీమ్..14 పరుగులకే టాప్ ఆర్డర్‌ మొత్తం కుప్పకూలిపోయిందంటే.. బెంగళూరు బౌలర్ల ప్రతాపం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. పేస్, స్పిన్ బౌలర్ల ధాటికి కోల్‌కత బ్యాట్స్‌మెన్లు ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ ఒక్కడే కుదురుకోగలిగాడు. అతను కూడా భారీ స్కోరును సాధించలేకపోయాడు.

సత్తా చాటిన హైదరాబాదీ...

సత్తా చాటిన హైదరాబాదీ...

ప్రత్యేకించి- హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు. ఈ నాలుగు ఓవర్లలో రెండు మెయిడెన్లు. బౌలర్లకు నరకాన్ని చూపించే టీ20 మ్యాచుల్లో ఒక మెయిడెన్ ఓవర్ సాధిస్తేనే గొప్ప విషయం. అలాంటిది ఒకే మ్యాచ్‌లో రెండు మెయిడెన్లను సంధించాడు. రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, బ్యాటన్ వికెట్లను పడగొట్టాడు. ఈ ముగ్గురూ కోల్‌కత బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముక వంటివారే. ప్రారంభ ఓవర్లలోనే సిరాజ్ చెలరేగిపోవడంతో.. ఇక ఏ దశలోనూ కోల్‌కత కోలుకోలేకపోయింది.

కేప్టెన్సీ మార్పు.. బెడిసికొడుతోందా?

కేప్టెన్సీ మార్పు.. బెడిసికొడుతోందా?

ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభంలో కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్ కేప్టెన్ దినేష్ కార్తీక్. సగం మ్యాచ్‌లు ముగిసే సరికి కేప్టెన్ మారిపోయాడు. దినేష్ కార్తీక్ స్థానంలో ఇవాన్ మోర్గాన్ కేప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. ఏడు మ్యాచ్‌లకు దినేష్ కార్తీక్ కేప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కేప్టెన్సీలో కోల్‌కత నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఉన్నట్టుండి అతను తప్పుకొన్నాడు. ఇవాన్ మోర్గాన్ సారథ్యంలో మూడు మ్యాచ్‌లను ఆడిన కోల్‌కత రెండింట్లో విజయం అందుకుంది.

మిడ్ సీజన్‌లో ప్రయోగంతో

మిడ్ సీజన్‌లో ప్రయోగంతో

మిడ్ సీజన్‌లో కేప్టెన్సీ మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బ్యాటింగ్‌పై దృష్టి సారించాల్సి ఉన్నందున తాను స్వచ్ఛందంగా తప్పుకొంటున్నట్టు దినేష్ కార్తీక్ వెల్లడించినప్పటికీ.. అతణ్ని ఉద్దేశపూరకంగా తప్పించారనే టాక్ ఉంది. కేప్టెన్‌ను మార్చడం వల్ల జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, గాడి తప్పుతుందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. దినేష్ కార్తీక్ స్థానంలో కేప్టెన్‌గా నియమితుడైన ఇవాన్ మోర్గాన్‌ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అతని కేప్టెన్సీలోనే ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ను అందుకుంది.

ముందున్నవన్నీ కఠిన సవాళ్లే..

ముందున్నవన్నీ కఠిన సవాళ్లే..

ఈ సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలకు ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏదీ లేదు. ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లోనే ఉంది. ఇంకో రెండు మ్యాచ్‌లను గెలిస్తే.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత టీమ్ ఆడిన తీరు ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఫీల్డింగ్‌లోనూ పెద్దగా మెరుపులు మెరిపించిన సందర్భాలు లేవు. తక్కువ స్కోరే అయినప్పటికీ బెంగళూరు జట్టుపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయారు కోల్‌కత బౌలర్లు. ఇదే పరిస్థితి కొనసాగితే.. చేతులారా అపజయాలను ఆహ్వానించినట్టవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 22, 2020, 9:04 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X