పంజాబ్ కింగ్స్ కథ ముగిసినట్టే?: ప్లేఆఫ్ ద్వారాలు క్లోజ్? ఒకే ఒక్క మార్గం: అదేమిటంటే?

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కథ ముగిసిపోయిందా? ప్లేఆఫ్ ద్వారాలు మూసుకుపోయాయా? ఎమిరేట్స్ నుంచి స్వదేశానికి విమానం ఎక్కబోయే తొలి జట్టు అదే కానుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎప్పట్లాగే.. ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తన పరాజయాలను కొనసాగిస్తోంది. కేప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదనిపిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నమెంట్‌లో ముందుకెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

సన్ రైజర్స్ చేతిలో..
దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో గురువారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమ్.. కనీసం పోరాడలేక చేతులెత్తేసింది. పంజాబ్ టీమ్‌లో నికొలస్ పూరన్ ఒకే ఒక్కడు హైదరాబాద్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి హార్డ్ హిట్టర్లు భారీ స్కోరును సాధించలేకపోయారు. సన్ రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. దాని దరిదాపులకు కూడా చేరుకోలేకపోయింది పంజాబ్.

ఆరు మ్యాచుల్లో ఒక్కటితోనే సరి..
ఇప్పటిదాకా ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు మ్యాచ్‌లను ఆడగా.. ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసింది. ఆ ఒక్క దానితోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది ఆ జట్టు పరిస్థితి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయికి చేరుకున్న ఆ జట్టు.. ఇక అక్కడి నుంచి లేవలేని స్థితికి చేరుకుంటోంది.. క్రమంగా. అయిదు మ్యాచుల ఓటమితో పంజాబ్ కింగ్స నెట్ రన్‌రేట్ దారుణంగా ఉంది. మైనస్ 0.431లో ఉంది. ఇప్పటిదాకా రెండు పాయింట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఆ జట్టు ముందుకు వెళ్లే అవకాశాలు లేవా?
ఈ సీజన్ టోర్నమెంట్‌లో పంజాబ్ జట్టు ముందుకు వెళ్లే అవకాశాలు లేవా? అంటే దాదాపు లేవనే అనుకోవాల్సి ఉంటుంది. ఉన్నా గానీ.. ఆ జట్టు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా? అనేది డౌటే. ఎందుకంటే.. ఆ టీమ్ ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. ఐపీఎల్‌లో ప్లేఆఫ్ బెర్త్ సంపాదించాలంటే ఏ జట్టయినా ఆరు మ్యాచ్‌లను గెలిచి తీరాలి. ప్రస్తుతం ఎనిమిది జట్లు ఆడుతున్నాయి. నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్‌లో ఆడే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో అట్టుడుగున ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందగా.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండేసి విజయాలను అందుకున్నాయి.

కింగ్స్ ముందు అన్నీ సవాళ్లే..
ఈ టోర్నమెంట్‌లో పంజాబ్.. ఇంకా తొమ్మిది మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. అంటే.. కనీసం ఆరు మ్యాచ్‌లల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ ఒక్కటీ ఎక్కువ ఎందుకంటే.. నెట్ రన్‌రేట్‌లో వెనుకబడటం వల్ల. ఏడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లల్లో విజయాన్ని అందుకోగలిగితేనే పంజాబ్ ఈ టోర్నమెంట్‌లో చివరికంటా ఉంటుంది. తొమ్మిదింట్లో ఆరు మ్యాచ్‌లను గెలిచే అవకాశం ఉందా? అంటే లేదనే అనుకోవాల్సి వస్తోంది. ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పాటు గాయపడ్డ సింహంలా తయారైన చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లను ఢీ కొట్టాల్సి ఉంది. ఆ జట్లకు ఎదురొడ్డి విజయం సాధిస్తుందా? అంటే లేదనే అనుకోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications