ఐపీఎల్ 2020లో మనం చూడబోయే కొత్త నిబంధనలివే!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌కు సర్వం సిద్ధమైంది. మార్చి 29 నుంచి మే 24 వరకు సందడి చేయబోతుంది. ఈ కొత్త సీజన్‌లో సరికొత్త రూల్స్‌ను అమలు చేయనున్నారు. ఐపీఎల్ క్రేజ్‌ను మరింత పెంచేందుకు పలు నిబంధనలను ఈ ఏడాది ఆచరణలోకి తీసుకురానున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు.
ఇక, టైమింగ్‌లో మార్పు ఉంటుందని భావించినా.. ఈప్రతిపాదనపై గత సోమవారం సుదీర్ఘంగా చర్చించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మ్యాచ్‌లు యధావిధిగా రాత్రి 8 గంటలకే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న విధంగా 'కంకషన్ సబ్‌స్టిట్యూట్'ను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక నోబాల్స్‌ను మాత్రమే చూసేందుకు ఒక టీవీ అంపైర్‌ను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్తగా చేరే అదనపు ఆకర్షణలు ఏంటో చూద్దాం...

ఆల్ స్టార్ గేమ్
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా బీసీసీఐ ఆల్ స్టార్ గేమ్‌ను నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లతో కలిసి సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం 'ఆల్ స్టార్స్ మ్యాచ్' నిర్వహిస్తామని సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇప్పుడు ఇదే అభిమానులకు హాట్ టాపిక్ అయింది.

నోబాల్స్ కోసం ప్రత్యేకంగా టీవీ అంఫైర్
ఈ ఏడాది ఐపీఎల్‌కు.. బీసీసీఐ నో బాల్స్‌పై సరికొత్త నిబంధనను అమలు చేయనుంది. నో బాల్ పర్యవేక్షణ థర్డ్ అంపైర్‌దేనని ఐసీసీ ఒక రూల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020లో నోబాల్స్‌ను థర్డ్ అంఫైర్ పర్యవేక్షించనున్నాడు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో మలింగా వేసిన నో బాల్ ఎంతటి దుమారానికి దారి తీసిందో మనందరికీ తెలిసిందే.

కాంకషన్ సబ్‌స్టిట్యూట్
అంతర్జాతీయ మ్యాచుల్లో మాదిరిగానే ఐపీఎల్‌లో కూడా ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ అందుబాటులోకి రానుంది. ఏ ఆటగాడైనా గాయపడితే.. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయవచ్చు. అయితే, దీనిపై మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఉమెన్స్ టీ20 మ్యాచులు
ఐపీఎల్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చేందుకు గాను నాలుగు జట్లతో మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గతేడాది మూడు జట్లు ఉండగా... 2018లో సూపర్నోవాస్, ట్రయిల్‌బ్లాజెర్స్ అనే రెండు జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు ఏకైక మ్యాచ్‌ని ఆడాయి. 2019లో బీసీసీఐ మొత్తం నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించినందున గతేడాది వెలాసిటీ అనే కొత్త జట్టుని చూశాం.

మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్
ఈ నిబంధనపై ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం దీనిని అమలు చేయాలని చూస్తోంది. క్యాప్డ్ ప్లేయర్స్ లేదా ఇండియన్/ ఓవర్సీస్ ఆటగాళ్లకు లోన్ లేదా మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఇవ్వాలని చూస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications