Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల భేటీ.. మళ్లీ 10 జట్లు?

IPL 2020: IPL 8 Franchise Owners Discuss Expansion to Ten Teams in London

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మళ్లీ 10 జట్లు ఆడేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఐపీఎల్ జట్ల విస్తరణపై ఫ్రాంచైజీల యాజమాన్యాలు తాజాగా లండన్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో చర్చించినట్లు సమాచారం తెలిసింది. అయితే విస్తరణపై ఫ్రాంచైజీలు ఓకే అన్నా బీసీసీఐదే అంతిమ నిర్ణయం కాబట్టి.. బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై ఓ స్పష్టత రానుంది.

 ఎనిమిది జట్లతో ప్రారంభం:

ఎనిమిది జట్లతో ప్రారంభం:

2008లో ఎనిమిది జట్లతో ఐపీఎల్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. 2011లో కొచ్చి టస్కర్స్‌, పూణె వారియర్స్‌ ఫ్రాంచైజీలు చేరడంతో వీటి సంఖ్య పదికి చేరింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)తో ఫీజు చెల్లింపు తదితర అంశాలపై తలెత్తిన వివాదాల కారణంగా కొచ్చి ఫ్రాంచైజీ ఒక సీజన్‌కే పరిమితమైంది. 2012, 2013 సీజన్లు తొమ్మిది జట్లతో జరిగాయి. ఇక దిగ్గజ సంస్థ సహారా కొనుగోలు చేసిన పుణే వారియర్స్ జట్టు 2013లో ఐపీఎల్ నుంచి వైదొలగింది. దీంతో 2014 నుంచి ఐపీఎల్ మళ్లీ ఎనిమిది జట్లకు తగ్గింది.

పుణే, గుజరాత్ ఎంట్రీ:

పుణే, గుజరాత్ ఎంట్రీ:

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండు సంవత్సరాలు సస్పెన్షన్‌(2016, 2017)కు గురయ్యాయి. ఆ సమయంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ (ఎంఎస్ ధోనీ-కెప్టెన్), గుజరాత్ లయన్స్ (సురేష్ రైనా-కెప్టెన్) జట్లు లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. 2017లో గుజరాత్ లయన్స్ మోస్తరుగా రాణించినా.. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఫైనల్ చేరింది. సస్పెన్షన్‌ అనంతరం 2018లో చెన్నై, రాజస్థాన్ జట్లు మళ్లీ లీగ్‌లోకి రావడంతో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఫ్రాంచైజీలు తప్పుకోవాల్సి వచ్చింది.

మళ్లీ ఆ జట్లేనా?:

మళ్లీ ఆ జట్లేనా?:

ఈ టోర్నీకి విశేష ఆదరణ ఉండడంతో 10 జట్లకు విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జట్ల యాజమాన్యం తాజాగా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకొని చర్చించారు. విస్తరణపై ఫ్రాంచైజీలు ఓకే అంటే గుజరాత్, పుణే జట్లు మళ్లీ ఐపీఎల్‌లోకి రానున్నాయి. అయితే ఈ రెండు జట్లే వస్తాయా? లేకా మళ్లీ బిడ్స్‌ను ఆహ్వానించి కొత్త ఫ్రాంజైలను తీసుకుంటారో తెలియదు. బీసీసీఐదే అంతిమ నిర్ణయం కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.

బీసీసీఐదే అంతిమ నిర్ణయం:

బీసీసీఐదే అంతిమ నిర్ణయం:

'ఐపీఎల్‌కు చాలా ఆదరణ ఉంది. దీంతో తాజా సమావేశంలో మళ్లీ జట్ల సంఖ్య పెంచాలనే విషయంపై చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో బీసీసీఐదే అంతిమ నిర్ణయం. ఒకవేళ జట్ల సంఖ్య పెరిగితే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో భారీ షెడ్యూల్‌ రూపొందించాలి. దీనిపై పెద్ద కసరత్తు చేయాలి. విదేశీ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండాలి' అని ఓ ఫ్రాంచైజీ అన్నారు.

Story first published: Monday, July 15, 2019, 15:11 [IST]
Other articles published on Jul 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+