ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ ఆర్సీబీ vs కేకేఆర్!!

హైదరాబాద్: ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్‌ను మాత్రం విడుదల చేయలేదు. ఇక మెగా టోర్నీ షెడ్యూల్ ఆదివారం విడుదల కానుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ నిర్వాహకులు శనివారం ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఐపీఎల్ పోస్టర్ విడుదల:
'డ్రీమ్ 11 ఐపీఎల్ 2020కి ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఇక ఆగలేకపోతున్నాం' అని ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ ప్రత్యక్షం అయింది. ఆ పోస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విరాట్ కోహ్లీ, కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి దినేశ్ కార్తిక్‌ల ఫొటోలు ఉన్నాయి. దీంతో ఉన్నట్టుండి ఐపీఎల్ నిర్వాహకులు ఈ పోస్టర్‌ను ఎందుకు విడుదల చేశారా? అని ఎందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

లీగ్ ఆనవాయితీ ప్రకారం:
సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ జట్ల మధ్య లీగ్ తొలి మ్యాచ్ జరగడం ఆనవాయితీ. దాంతో ఐపీఎల్ 2019 విజేత ముంబై, రన్నరప్ చెన్నై మధ్య ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభ మ్యాచ్ జరిగేలా బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించింది. అయితే చెన్నై జట్టులో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. సెప్టెంబరు 19 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని బీసీసీఐ గతవారం పునరాలోచనలో పడింది. ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ నిర్వహించాలని కూడా ఓ ప్రణాళిక రూపొందించిందని ఊహాగాలను వెలుబడ్డాయి.

ఆర్సీబీ vs కేకేఆర్:
అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు వారం రోజుల్లో కోలుకున్నారు. దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్‌లు తప్ప ఆ టీమ్‌లోని 11 మంది స్టాఫ్ కరోనా బారినుంచి కోలుకున్నారు. దీంతో లీగ్ ఆనవాయితీ ప్రకారమే.. తొలి మ్యాచ్ ముంబై, చెన్నై జట్ల మధ్య జరగనుందని మళ్లీ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఐపీఎల్ నిర్వాహకులే ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేయడంతో.. తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ జట్ల జరనుందని తెలుస్తోంది. ఏదేమైనా రేపు అసలు విషయం తేలనుంది.

53 రోజుల విండోలో 60 మ్యాచ్‌లు:
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఐపీఎల్ 2020 లీగ్ యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. బయో సెక్యూర్ వాతావరణంలో ఈ నెల 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరుగనుంది. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications