For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భౌతిక దూరం పాటించకుండా బ్యాటింగ్: 11వ బ్యాట్స్‌మెన్‌గా హార్ధిక్: ఒకే బౌలర్ రెండుసార్లు

 IPL 2020 in UAE: Hardik Pandya has become the 11th batsman in IPL history to lose his wicket

అబుధాబి: భౌతిక దూరాన్ని పాటించకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసు. గ్రౌండ్ బయట.. అలా తిరిగితే కరోనా వైరస్ మన నెత్తికెక్కి కూర్చుంటుంది. గ్రౌండ్ లోపలా దాన్ని పాటించకపోతే.. వికెట్లు గల్లంతవుతాయి. బెయిల్స్ గాల్లోకి ఎగురుతాయి. ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కనిపించింది ఇదే. స్టంప్స్‌తో ఏ మాత్రం భౌతిక దూరాన్ని పాటించకుండా బ్యాటింగ్ చేసిన హార్థిక్ పాండ్యా..తన వికెట్‌ను తనే పారేసుకున్నాడు. ట్రోల్స్‌కు గురవుతున్నాడు. ఐపీఎల్‌లో ఈ చెత్త రికార్డును అందుకున్న 11వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

19వ ఓవర్‌లో

టీ20 మ్యాచ్‌లల్లో స్లాగ్ ఓవర్లు ఎంత కీలకమో చెప్పుకోనక్కర్లేదు. స్లాగ్ ఓవర్లలో ప్రతి బంతినీ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నిస్తాడు బ్యాట్స్‌మెన్. పైగా హార్ధిక్ పాండ్యా వంటి హిట్టర్ క్రీజ్‌లో ఉంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. అలాంటి స్లాగ్ ఓవర్లలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు హార్థిక్ తన వికెట్‌ను తనే పడగొట్టుకున్నాడు. హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఒక సిక్సు, రెండుఫోర్లతో మాంఛి దూకుడు మీదున్నాడు హార్థిక్. 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

కొంపముంచిన అత్యుత్సాహం..

కోల్‌కత నైట్ రైడర్స్ బౌలర్ ఆండ్రీ రస్సెల్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి.. బ్యాట్‌తో స్టంప్స్‌ను హిట్ చేశాడు. డీప్ ఇన్‌సైడ్ క్రీజ్‌లో నిల్చున్న హార్థిక్.. ఆండ్రీ రస్సెల్ వేసిన ఫుల్ డెలివరీని ఆడబోయాడు. బ్యాట్ ఎడ్జ్.. స్టంప్స్‌ను తాకింది. బెయిల్స్‌ను ఎగురగొట్టింది. దీనితో హిట్ వికెట్‌గా హార్ధిక్ వెనుదిరిగాడు. అంతకుముందు- క్రీజ్‌లో స్వేచ్ఛగా కదిలాడతను. భారీ షాట్లను ఆడాడు. ఆఫ్‌సైడ్ బంతులను కూడా ఆన్‌సైడ్‌లో భారీ షాట్లు కొట్టాడు. తీరా అదే అతని కొంపముంచింది. తాను డీప్ క్రీజ్‌లో ఉన్నాననే విషయాాన్ని కూడా పట్టించుకోలేదు.

ఒకే బౌలర్ రెండుసార్లు..

హిట్ వికెట్‌గా వెనుదిరగడమే అత్యంత అరుదుగా అనుకుంటే.. ఒకే బౌలర్ రెండుసార్లు ఆ ఫీట్ సాధించడం ఇంకా అరుదు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో ఓ బ్యాట్స్‌మెన్ హిట్ వికెట్ కావడం ఇది రెండోసారి. 2019 ఐపీఎల్ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్.. ఇదే తరహాలో అవుట్ అయ్యాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో హుక్ షాట్‌కు ప్రయత్నించిన రియాన్ పరాగ్.. కాలితో స్టంప్స్‌ను తాకాడు. 2017లో కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్.. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు.

లిస్టు పెద్దదే..

ఐపీఎల్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన బ్యాట్స్‌మెన్ల జాబితా పెద్దదే. యువరాజ్ సింగ్, డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, మిస్బా వుల్ హక్ వంటి హేమాహేమీల్లాంటి బ్యాట్స్‌మెన్లు సైతం ఈ పొరపాటు చేశారు. 2016లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూవీ హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. అది అతని వందో మ్యాచ్ కూడా. అదే సీజన్‌లో డేవిడ్ వార్నర్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీపక్ హుడా, సౌరభ్ తివారీ, స్వప్నిల్ అస్నోడ్కర్, ముసావిర్ ఖోటే.. హిట్ వికెట్‌గా అవుటైన వారిలో ఉన్నారు. అదే జాబితాలో చేరాడు హార్థిక్ పాండ్యా.

Story first published: Thursday, September 24, 2020, 8:45 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+