Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: అంపైర్లతో ధోనీ ఎన్నిసార్లు వాగ్వాదానికి దిగాడో తెలుసా... ఇదిగో జాబితా..!

IPL 2020: Here is the list of IPL incidents where Dhoni lost his cool and argued with umpires

మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అన్ని ఫార్మాట్లకు నాయకత్వం వహించిన ధోనీ సాధారణంగా చాలా కూల్‌గా కనిపిస్తాడు. అందుకే అతన్ని మిస్టర్ కూల్ అని క్రికెట్ ప్రపంచం పిలచుకుంటుంది. అయితే ఎంత ఓపిక సహనంతో ఉన్నప్పటికీ... ధోనీ సహనం కోల్పోయిన ఘటనలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అదే సమయంలో అంపైర్ల నిర్ణయాలను విబేధించిన ఘటనలు కూడా చాలా అరుదు.

అంపైర్ల నిర్ణయంతో విబేధించిన ధోనీ

అంపైర్ల నిర్ణయంతో విబేధించిన ధోనీ

క్రికెట్ అంటేనే హై ఇంటెన్సిటీ గేమ్. ఎన్నో ఎమోషన్స్ ఈ గేమ్‌తో అల్లుకుపోయి ఉన్నాయి. ఎంతో సహనంతో ఉండే వారు కూడా ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అలాంటి వారిలో ధోనీ ఒకడు. అయితే చాలా మటుకు ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ... ఆటలో భాగంగా భావోద్వేగానికి గురవుతుంటారు. ఇక ధోనీ 16 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఎప్పుడూ ఫీల్డ్‌లో చాలా కూల్‌గా కనిపించే ధోనీ... పలు సందర్భాల్లో సహనం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అదే సమయంలో అంపైర్లు ఇచ్చే నిర్ణయంతో కూడా విబేధించిన సందర్భాలు కూడా చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి కొన్ని ఘటనలు ఇప్పుడు చూద్దాం.

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

చెన్నై సూపర్ కింగ్స్‌ మరియు సన్‌రైజర్స్‌తో జరిగిన 29వ మ్యాచ్‌లో ధోనీ అంపైర్ల నిర్ణయంతో విబేధించడం జరిగింది. ఇది చాలా రీసెంట్‌గా జరిగింది. చెన్నై బౌలర్ శార్ధుల్ ఠాకూర్ బంతిని వైడ్‌గా వేయగా రశీద్ ఖాన్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అంపైర్ పాల్ రీఫెల్ బంతిని వైడ్‌గా ఇవ్వబోగా ధోనీ నిరాశకు గురయ్యాడు. వెంటనే రీఫిల్ తన డెసిషన్‌ను మార్చుకుని వైడ్ ఇవ్వలేదు. దీనిపై వార్నర్ డగౌట్ నుంచి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఈ మ్యాచులో సీఎస్‌కే 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

ఇక రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రాజస్థాన్ ఆటగాడు టామ్ కరన్ ఆడిన బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ముందుగా అవుట్‌గా ప్రకటించిన అంపైర్ శంషుద్దీన్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రివ్యూకు ఇచ్చాడు. అయితే రాజస్థాన్ జట్టుకు రివ్యూ లేదని అలా ఎలా ఇస్తారని అంపైర్లను ధోనీ ప్రశ్నించాడు. ఆ సమయంలో టామ్ కరన్ నాటౌట్‌గా ఇవ్వడం జరిగింది.

2019లో కూడా రాజస్థాన్ రాయల్స్ పై

2019లో కూడా రాజస్థాన్ రాయల్స్ పై

ఇక 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు గెలిచేందుకు చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉన్నింది. ధోనీని స్టోక్స్ ఔట్ చేయడంతో చివరి 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉంది. మిచెల్ శాంట్నర్‌కు స్టోక్స్ ఫుల్ టాస్ బాల్ వేశాడు. అయితే లెగ్ అంపైర్‌గా ఉన్న బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్‌గా ఇవ్వలేదు. దీంతో ధోనీ మైదానంలోకి అడుగుపెట్టి అంపైర్‌తో వాగ్వాదంకు దిగాడు. కానీ అంపైర్ మాత్రం తన డెసిషన్‌ను మార్చుకోలేదు. ఆ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఆ తర్వాత అంపైర్లకు ధోనీ క్షమాపణ చెప్పాడు.

Story first published: Friday, October 16, 2020, 12:54 [IST]
Other articles published on Oct 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+