వైరల్ వీడియో.. బుల్లి పాండ్యాతో ఆడుకుంటున్న నటసా స్టాంకోవిక్!!

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా, అతడి భార్య నటసా స్టాంకోవిక్‌ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తరచూ వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. గత జులైలో ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారి కుమారుడు బుల్లి పాండ్యా (ఆగస్త్య)కు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటూరు. తాజాగా నటషా తన రెండు నెలల కుమారుడు ఆగస్త్యతో ఆడుకుంటున్న వీడియోను సోమవారం షేర్‌ చేశారు.

వీడియోలో ఆగస్త్యతో నటషా స్టాంకోవిక్‌ ఆడుకుంటున్నారు. నటషా మాట్లాడుతూ ఉంటే తన ముక్కపై ముద్దుముద్దుగా ఆగస్త్య కొడుతున్నాడు. దీనికి సంబందించిన వీడియోను 'రెడ్‌ హర్ట్'‌ ఎమోజీ ​క్యాప్షన్‌తో నటషా పంచుకున్నారు. ఇలా నటషా తన మాతృత్వ మాధుర్యాని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ విడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. 'ఆగస్త్యా చాలా ముద్దుగా ఉన్నాడు','హార్ధిక్‌ పాండ్యా 2.O' అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. బుల్లి పాండ్యా సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

హార్దిక్‌, నటాషా చాలాకాలం ప్రేమించుకున్నారు. అప్పుడప్పుడు కలిసి పార్టీలు, పార్క్‌లకు వెళ్లేవారు. హఠాత్తుగా గతేడాది డిసెంబర్‌ 31 రాత్రి దుబాయ్‌లో సముద్ర జలాల్లో విహరిస్తూ నటాషాకు పాండ్యా నిశ్చితార్థపు ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే ఉన్నట్టుండి లాక్‌డౌన్‌లో అతడు మళ్లీ షాకిచ్చాడు. తన భార్య గర్భం దాల్చిందని చెప్పాడు. ఎవరినీ పిలవకుండా కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నట్టు ఆ తర్వాత తెలిసింది.

ఐపీఎల్ 2020లో హార్థిక్‌ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నారు. గత రాత్రి రాజస్థాన్‌ రాయల్స్ జట్టుతో మ్యాచులో పాండ్యా (60 నాటౌట్‌ :21 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. పాండ్యా రెచ్చిపోవడంతో ముంబై అనూహ్య స్కోరు చేసింది. ఛేదనలో బెన్‌ స్టోక్స్ ‌(107: 60 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత సెంచరీతో మెరిశాడు. సంజూ శాంసన్‌ (54 నాటౌట్‌: 31 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించడంతో 196 పరుగుల లక్ష్యాన్ని18.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

View this post on Instagram

❤️

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

RCB vs CSK: మాకు స్కార్క్ కనిపించింది.. మహీ భాయ్ మీకు మరి!! మొన్న తిట్టిన వారే ఇవాళ పొగుడుతున్నారు!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, October 26, 2020, 10:06 [IST]
Other articles published on Oct 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X