హీటెక్కుతోన్న ఐపీఎల్: ఆల్‌రౌండర్ల ఫేస్ టు ఫేస్: సిక్స్ కొట్టి..రెచ్చగొట్టి: ఆ వెంటనే అవుట్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోొ సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ ముగింపు దశకు వచ్చే కొద్దీ వేడెక్కుతోంది. లీగ్ దశ ముగుస్తోన్నవేళ..ప్లేఆఫ్‌కు దశకు చేరుకుంటోన్న సందర్భంలో ఐపీఎల్ మ్యాచ్‌లు వాడివేడిగా మారుతున్నాయి. వాతావరణాన్ని హీటెక్కించేస్తున్నాయి. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతోంది. సహజంగానే దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం ఉన్న ప్లేయర్లు.. మరింత రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు.

సన్‌రైజర్స్ నెత్తిన పిడుగు: సాహా గాయం: తీవ్రం కాదంటూనే: బీసీసీఐ దృష్టికి: నెక్స్ట్ మ్యాచ్‌కు

 ఆల్‌రౌండర్ల ఫేస్ ఆఫ్

ఆల్‌రౌండర్ల ఫేస్ ఆఫ్

ఇలాంటి రెండు సంఘటనలు ఒకే మ్యాచ్‌లో కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అబుధాబి స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆల్‌రౌండర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్యా మాటలు తూటాల్లా పేలాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్‌ను తలపించింది. టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ అమీర్ సొహైల్ అవుట్ అయిన ఎపిసోడ్‌ను గుర్తుకు తెచ్చింది.

హార్థిక్ పాండ్యా వర్సెస్ క్రిస్ మోరిస్

హార్థిక్ పాండ్యా వర్సెస్ క్రిస్ మోరిస్

సిక్స్ కొట్టి బౌలర్‌ను రెచ్చగొట్టిన బ్యాట్స్‌మెన్.. ఆ తరువాతి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. ఆ ఇద్దరు ఆల్‌రౌండర్లు.. హార్థిక్ పాండ్యా, క్రిస్ మోరిస్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్.. 19వ ఓవర్‌ను వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా దాన్ని సిక్స్‌గా మలిచడు. సిక్స్ కొట్టిన వెంటనే మోరిస్‌ను ఉద్దేశించి ఏవో మాటలు అన్నాడు. ఇది కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. దానికి మోరిస్ ఎలాంటి సమాధానం రాలేదు.

నెక్స్ట్ బంతికే అవుట్..

నెక్స్ట్ బంతికే అవుట్..

దెబ్బతిన్న పులిలా కనిపించాడను. అదే ఓవర్ అయిదో బంతికి హార్ధిక్ పాండ్యాను బలి తీసుకున్నాడు. మోరిస్ వేసిన స్లోవర్‌ను అంచనా వేయలేకపోయాడు. షాట్ ఆడాడు. మిడాన్‌లో ఉన్న సిరాజ్ చేతుల్లో వాలిందా బాల్. హార్థిక్ అవుటై క్రీజ్‌ను వదిలి వెళ్తుండగా.. మోరిస్ అతణ్ని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. దీనితో హార్దిక్ పాండ్యా.. వెనక్కి తిరిగాడు. మోరిస్‌ వైపు వేలేత్తి చూపుతూ గట్టిగా మాట్లాడాడు. 15 బంతుల్లో రెండు సిక్సులతో 17 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 158 పరుగుల వద్ద అతను అవుట్ అయ్యాడు. అప్పటికే ముంబై ఇండియన్స్ విజయానికి దగ్గర కావడంతో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం రాలేదు.

ఇదే మ్యాచ్‌లో సెడ్జింగ్..

ఇదే మ్యాచ్‌లో సెడ్జింగ్..

ఇదే మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌‌తో అతను గొడవ పడేలా కనిపించాడు. దూకుడు మీదున్న సూర్యకుమార్ యాదవ్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు విరాట్ కోహ్లీ. క్రీజ్‌లో ఉన్న అతని వద్దకు వెళ్లీ మరీ కవ్వింపు చర్యలకు దిగాడు. సూర్యకుమార్ అతణ్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎర్రబడ్డ ముఖంతో కనిపించాడు విరాట్. ఈ రెండు పరిణామాలు ఒకే మ్యాచ్‌లో చోటు చేసుకోవడం.. ఐపీఎల్‌లో ఆటగాళ్ల మధ్య స్పోర్టివ్‌నెస్ లేదనే సందేశాన్ని ఇచ్చినట్టయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 9:47 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X