షాకింగ్.. షాకింగ్!!.. రషీద్‌ ఖాన్ సతీమణి అనుష్క శర్మనే అట!!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కదా!!. మరి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్‌ ఖాన్‌ భార్య అని అంటున్నారేంటి? అనే సందేహం వచ్చిందా?. ఇలా రావడం ప్రతిఒక్కరికి సహజమే. అసలు విషయం ఏంటంటే.. గూగుల్‌లో 'రషీద్‌ ఖాన్‌ వైఫ్' అని సెర్చ్‌ చేస్తే.. అనుష్క శర్మ అని వస్తుంది. నిజం చెప్పాలంటే 22 ఏళ్ల రషీద్‌ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. మరి మెటీరియల్ స్టేటస్ సింగల్ అని ఉండాలి? లేదా వేరే అమ్మాయి పేరేదైనా ఉండాలి కానీ.. కోహ్లీ సతీమణి పేరు ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.

రషీద్‌ ఖాన్‌ వైఫ్ అని సెర్చ్‌ చేస్తే

రషీద్‌ ఖాన్‌ వైఫ్ అని సెర్చ్‌ చేస్తే

2018లో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లతో రషీద్‌ ఖాన్‌ మాట్లాడుతూ... తన ఫేవరెట్‌ హీరోయిన్లు‌ అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. ఇక అ‍‍ప్పటి నుంచి ఈ వార్త ట్రెండింగ్‌గా మారింది. రషీద్‌ ఖాన్‌ ఫేవరెట్‌ 'అనుష్క శర్మ' అని ఎక్కువగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి 'రషీద్‌ ఖాన్‌ వైఫ్' అని సెర్చ్‌ చేస్తే.. అనుష్క శర్మ అని చూపిస్తుంది. ఇది నిజం. కావాలంటే మీరు గూగుల్‌లో రషీద్‌ ఖాన్‌ వైఫ్ అని సెర్చ్‌ చేసి చూడండి. ఇదే సమాధానం వస్తుంది. 4,33,00,000 రిజల్ట్స్ చూపిస్తుంది.

అనుష్కకు తెలిస్తే

అనుష్కకు తెలిస్తే

ప్రస్తుతం 'రషీద్‌ ఖాన్‌ వైఫ్' అనే టాగ్ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అయింది. మొదటగా ఇది చూసినవారందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇక అసలు విషయం తెలుసుకుని.. అదా సంగతి అని ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ఈ విషయం రషీద్‌ ఖాన్‌, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు తెలుసో లేదో మరి. ఒకవేళ విషయం తెలిస్తే వారెలా స్పదిస్తారో చూడాలి. ఏదేమైనా రషీద్‌ ఖాన్‌ మాత్రం ఈరోజు వార్తల్లో నిలిచాడు.

కీలక బౌలర్‌గా సేవలు

కీలక బౌలర్‌గా సేవలు

అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. అతడిని ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మన్‌ ముప్పుతిప్పలు పడుతున్నారు. అయితే అతడికి రషీద్‌కు మాత్రం పెళ్లి కాలేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగితే, అఫ్గనిస్తాన్‌ జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోనని ఇదివరకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపాడు. అఫ్గాన్ తరఫున రషీద్‌ 4 టెస్టులు, 71 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.

2017లో వివాహం

2017లో వివాహం

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విరాట్-అనుష్క.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుండి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతున్నారు. 32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు. అనుష్క వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె కోహ్లీతో కలిసి యూఏఈలో ఎంజాయ్ చేస్తున్నారు.

MI vs DC: ముంబైపై మ్యాచ్ ఓడి.. సెంచరీ నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, October 12, 2020, 11:40 [IST]
Other articles published on Oct 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X