ఈ గూగుల్ తల్లికి ఏమైంది: ఆ యంగ్ క్రికెటర్ భార్యగా సచిన్ కుమార్తె: గతి తప్పుతున్న సెర్చ్ ఇంజిన్

ముంబై: గూగుల్.. ఎవరికి ఎలాంటి సమాచారాన్నయినా సెకెండ్ల వ్యవధిలో ముందుంచ గల సత్తా దీనికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగించే ఈ గూగుల్ గతి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ భార్య అనూష్కశర్మను ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్యగా చూపించింది. నవ్వులపాలైంది. మళ్లీ అలాంటి తప్పుడు సమాచారాన్ని జనం ముందు ఉంచుతోంది. తాజాగా- యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ భార్య ఎవరని ప్రశ్నిస్తే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ పేరును చూపుతోంది.

Shubhman Gill's wife అని సెర్చ్ చేస్తే..
Shubhman Gill's wife అని గూగుల్ సెర్చ్ చేస్తే.. వెంటనే సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ఫేరు, ఫొటోలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతున్నాయి. శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్, సచిన్ టెండుల్కర్ ఫ్యామిలీ ఫొటోలు తెరమీదికి వస్తున్నాయి. శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్.. ఇద్దరూ అవివాహితులే. ఇంకా పెళ్లి కాలేదు. వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనేది ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. ఐపీఎల్-2020 సీజన్‌లో శుభ్‌మన్ గిల్.. కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అతను. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే శుభ్‌మన్ గిల్‌కు లవ్ ఎమోజీలతో తన లవ్ ఎమోషన్‌ను వ్యక్తం చేసిందామె.

తప్పును సరిదిద్దుకోవట్లేదింకా..
మొన్నటికి మొన్నే విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మను ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్యగా మార్చివేసింది గూగుల్. స్పిన్నర్ రషీద్ ఖాన్.. ఐపీఎల్-2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. Rashid Khan wife అని సెర్చ్ చేసిన వాళ్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది గూగుల్ తల్లి. రషీద్ ఖాన్, అనూష్క శర్మ ఫొటోలను చూపించింది. ఇప్పుడూ అదే పరిస్థితి. శుభ్‌మన్ గిల్ భార్య ఎవరని ప్రశ్నించడమే పొరపాటైనట్టుగా తప్పుడు సమాచారాన్ని చూపింది. రషీద్ ఖాన్ విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకోలేదనేది దీనితో క్లియర్ అయింది.

శుభ్‌మన్-సారాపై విస్తృత కథనాల వల్లే?
శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని, వారిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు కుప్పలు తెప్పలుగా వెలువడ్డాయి. కొన్ని సందర్భాల్లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ క్వశ్చన్ మార్క్ కథనాలు కూడా వచ్చాయి కొన్ని స్పోర్ట్ బేస్డ్ వెబ్‌సైట్లలో. దాని ఫలితంగానే- వారిద్దరికీ పెళ్లయిందనే విషయాన్ని గూగుల్ తల్లి నిర్ధారించిందని చెబుతున్నారు. గూగుల్ అల్గోరిథమ్స్‌లో ఇటీవల చేసిన మార్పుల ఫలితంగా ఇలాంటి గందరగోళ సమాచారం వెలువడుతోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలో దుమారం..
ఈ వ్యవహారం అంతా గమనిస్తోన్న నెటిజన్లు ఊరుకుంటారా? ఉండరు. తమ బుర్రకు పదును పెట్టడానికి ఆ మాత్రం చాలు. రెచ్చిపోతున్నారు. శుభ్‌మన్ గిల్-సారా టెండుల్కర్ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని, దాన్ని గూగుల్ కూడా నిర్ధారించిందనీ ఖాయం చేస్తున్నారు. వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందనే విషయాన్ని సారా టెండుల్కర్ చెప్పకనే చెప్పిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ మధ్య డేటింగ్ నడుస్తోందనే విషయాన్ని సారా తనకు తానుగా బయట పెట్టినట్టయిందనీ అంటున్నారు. ఇదివరకు వారిద్దరి మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై చోటు చేసుకున్న సంభాషణనూ ప్రస్తావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications