
10 శాతం వాటా విలువ సుమారు రూ.100 కోట్లు
ఈ 10 శాతం వాటా విలువ సుమారు రూ.100 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ కొనుగోలు వ్వవహారంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గంభీర్‌ను అధికారికంగా సహా యజమానికి ప్రకటించనున్నారు.

గంభీర్ సైతం
గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతం వాటాను జెఎస్డబ్ల్యు స్పోర్ట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. "ఈ విషయం గత కొన్ని నెలలుగా చర్చించబడుతుంది. మరికొద్ది రోజుల్లో ఇది కొలిక్కి రానుంది" అని ఢిల్లీ క్యాపిటల్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ అగ్రిమెంట్‌పై గంభీర్ సైతం సంతకం చేయాల్సి ఉంది.

గంభీర్ నాయకత్వంలో రెండు సార్లు
ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో గౌతమ్ గంభీర్ ఒకడు. గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. రంజీ క్రికెట్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన ఢిల్లీకి ఐపీఎల్ టైటిల్ అందించాలనే లక్ష్యంతో గత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడాడు.

గంభీర్ స్థానంలో అయ్యర్
అయితే, గంభీర్ కెప్టెన్‌గా విఫలం కావడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను జట్టు యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టైటిల్ ముంగిట బోల్తా పడింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, సందీప్ లమిచానె, రబాడ, కీమో పాల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచ్రందన్ అశ్విన్ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)
వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు
క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్ సక్సేన, మన్‌జ్యోత్ కల్రా, నాథుసింగ్, అంకుష్ బేయాన్స్, కొలిన్ మన్రో
మిగిలిన నగదు
ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఢిల్లీ పర్సులో మిగిలి ఉన్న నగదు రూ. 5.3 కోట్లు. తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఢిల్లీ అత్యధికంగా రూ .19 కోట్లు మిగిలాయి. మరోవైపుబిసిసిఐ వైపు నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2020 వేలంలో రూ. 27.85 కోట్లు ఖర్చు చేయవచ్చు.


Click it and Unblock the Notifications
