ఐపీఎల్ పాలక మండలి తీరుపై ఫ్రాంచైజీల గుర్రు.. రంగంలోకి దిగిన గంగూలీ!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం దుబాయ్ బయలుదేరారు. పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ సన్నాహాలను గంగూలీ దగ్గరుండి పరిశీలించనున్నారు. లీగ్ ఆరంభానికి పది రోజుల సమయం లేదు. పరిష్కరించాల్సిన సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయట.

ఫ్రాంచైజీలన్నీ గుర్రు:
పలు అంశాలపై ఐపీఎల్ పాలక మండలి సరిగ్గా స్పందించడం లేదని లీగ్ ఫ్రాంచైజీలన్నీ గుర్రుగా ఉన్నాయని సమాచారం. పాలక మండలి తీరుపై విసిగిపోయిన ఫ్రాంచైజీలు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతోనే నేరుగా మాట్లాడేందుకు నిర్ణయించుకున్నాయట. అందుకే లీగ్ సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు బుధవారం దాదా దుబాయ్‌కి వచ్చారని ఐపీఎల్ వర్గాల సమాచారం.

22 మంది ఆటగాళ్లు:
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్ల క్వారంటైన్ అంశంపై ఐపీఎల్ పాలక మండలిని సరైన స్పష్టత ఇవ్వలేదని సమాచారం. వారిని క్వారంటైన్‌లో ఉంచాలా, లేదా అనే అంశంపై స్పందించకుండా ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఈ రెండు జట్లు ఇంగ్లండ్‌లో ద్వైపాక్షిక సిరీసులు ఆడుతున్నాయి. టీ20 సిరీస్ ముగియగా.. 11 నుంచి 16 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 17న ఇరు జట్లలోని 22 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు దుబాయ్ చేరుకోవాలి. ముంబై ఇండియన్స్ మినహా ఏడు ఫ్రాంచైజీలు వీరందరికి ఒకే విమానం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఫ్రాంచైజీలతో దాదా సమావేశం:
ఇక ఐపీఎల్ 2020 కోసం భారత్, విదేశాల నుంచి యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. మూడుసార్లు కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారు. నెగెటివ్ రావడంతో రోజూ సాధన చేస్తున్నారు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్ సైతం బయో బుడగలోనే జరుగుతోంది. ఒక బయో బుడగ నుంచి సురక్షితంగా మరో బడుగలో అడుగుపెడితే క్వారంటైన్ అవసరమా? వద్దా? అనే విషయం అడిగితే ఐపీఎల్ పాలక మండలి స్పందించలేదు. అందుకే ఫ్రాంచైజీలు గురుగా ఉన్నాయి. ఈ విషయమై సౌరవ్ గంగూలీ ఫ్రాంచైజీలతో ఈరోజు సమావేశమయ్యే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications