Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. సల్మాన్ ‌ఖాన్‌ మీమ్‌ వైరల్!!

IPL 2020 Final: Virender Sehwag congratulated Delhi Capitals, shared a meme featuring Salman Khan

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ చరిత్రలో ఎనిమిదోసారి టాప్‌-2 జట్లే టైటిల్‌ పోరుకు అర్హత పొందాయి. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సిద్దమైంది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ తొలిసారి ఐపీఎల్ ఫైనల్ చేరడంపై ఆ జట్టు అభిమానులు, మాజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీ మాజీ కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ఓ ట్వీట్‌ చేశాడు.

2000 సంవత్సరంలో స్టార్ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా' సినిమాలోని 'ఏసా పెహ్లీ బార్‌ హువా హై 17-18 సాలో మే' పాట మీమ్‌ను జోడిస్తూ వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. 'ఐపీఎల్ ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అభినందనలు. ఈ లీగ్‌లో నిరంతరాయంగా ఆడుతూ ఇప్పటివరకూ ఫైనల్స్‌ చేరని ఒకే ఒక్క జట్టు ఇప్పుడు అక్కడికి దూసుకెళ్లింది. 2020 ఇంకా ఎక్కువే చూపిస్తుంది' అని వీరూ పేర్కొన్నాడు. ఢిల్లీ కప్ కొడుతుందని వీరూ చెప్పకనే చెప్పాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపొందడంతో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఇక ఓడిన డొనాల్డ్‌ ట్రంప్‌పై కొందరు వ్యంగ్యంగా ట్వీట్‌లు చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫన్నీగా ట్వీట్ చేశాడు. 'మా వాళ్లు అలాగే ఉన్నారు. ట్రంప్‌ బాబాయ్‌ కామెడీ మిస్‌ అవుతాం' అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. శిఖర్ ధావన్ ‌(78), మార్కస్‌ స్టోయినిస్‌ (38), షిమ్రన్‌ హెట్‌మైయిర్ ‌(42) రాణించారు. అనంతరం హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (67), అబ్దుల్‌ సమద్ ‌(33) పోరాడడంతో ఒక దశలో లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించింది. అయితే స్టోయినిస్‌, రబాడ రేచిపోవడంతో వార్నర్‌ సేన 172 పరుగులకే పరిమితం అయింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి హైదరాబాద్‌ నిష్క్రమించింది.

Story first published: Monday, November 9, 2020, 14:20 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+