మే 24న ఐపీఎల్ 2020 ఫైనల్.. రాత్రి 7.30 నుంచే మ్యాచ్‌లు?

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13 సీజన్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌తో లీగ్ ప్రారంభమయి.. మే 24న ముంబైలోనే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. అంటే మొత్తం 57 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. టోర్నీ ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు తర్వాతి సీజన్‌లో ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంటుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కాబట్టి.. తొలి, ఫైనల్ మ్యాచ్ ముంబైలోనే జరగనున్నాయి.

ఈ సీజన్‌లో పలు మార్పులు:
ఐపీఎల్-2020 సీజన్‌లో పలు మార్పులు ఉండబోతున్నట్టు సమాచారం తెలుస్తోంది. గతంలో 45 రోజులపాటు సాగిన లీగ్.. ఈసారి 57 రోజుల పాటు జరగనుంది. ఇక మ్యాచ్‌లు రాత్రి 8.00 గంటల నుంచి కాకుండా.. 7.30 నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి రోజుకు ఒకే మ్యాచ్ జరగనుందట. ఐపీఎల్ ప్రసారదారు కోరిక మేరకు మ్యాచ్‌లను అరగంట ముందుగా ప్రారంభం అవుతున్నాయని సమాచారం.

రోజుకు ఒకే మ్యాచ్:
టోర్నీ నిర్వాహకులు ఇప్పటి వరకు వీకెండ్స్‌లో రెండేసి మ్యాచ్‌లను నిర్వహించేవారు. అయితే మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లకు స్టేడియాలు ఎక్కువగా ఖాళీగానే ఉంటుండడంతో.. ఆయా జట్ల ఆదాయంపై ప్రభావం పడుతోంది. దీంతో పలు ఫ్రాంచైజీలతో పాటు ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ కూడా రోజుకు ఒకే మ్యాచ్ ఉంటే బాగుంటుందని భావిస్తోందని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి.

రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌లు:
'ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూలు ఇంకా ఖరారు కానప్పటికీ ఫైనల్ మాత్రం మే 24న నిర్వహిస్తారు. టోర్నీ మార్చి 29న ఆరంభమవుతుంది. అంటే 45 రోజుల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో.. రోజుకు ఒకే మ్యాచ్ నిర్వహించేందుకు ఇబ్బందేమీ ఉండదు. 57 రోజులు మ్యాచులు నిర్వహించడం చాలా తేలిక. టీఆర్పీ రేటింగ్‌తోనే అసలు సమస్య. మ్యాచ్ ఆలస్యమవ్వడమే దీనికి కారణం. అప్పుడు స్టేడియాలకు వచ్చిన వారు ఇంటికి వెళ్లడమూ ఇబ్బందిగా మారుతోంది. చర్చలు ఇంకా జరుగుతున్నప్పటికీ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ఆరంభం కావొచ్చు' అని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

టీఆర్పీ రేటింగ్స్ ఉండటం లేదు:
'హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఆఫీస్ నుంచి ఉద్యోగులు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఇంటికెళ్లడం ఎంత కష్టమో తెలిసిందే. మ్యాచ్‌లు ముందుగా ప్రారంభమైతే కుటుంబ సభ్యులతో కలిసి వారు స్టేడియాలకు వస్తారో? లేదోనని ఫ్రాంచైజీల బెంగ. మ్యాచ్ సమయాన్ని ముందుకు జరిపేముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాయంత్రం 4 గంటల మ్యాచులకు మాత్రం టీఆర్పీ రేటింగ్స్ ఉండటం లేదు. అభిమానులూ రావడం లేదు. అందుకే వాటిని రద్దు చేసేందుకు ఇబ్బందేమీ లేదు' అని ఆ వర్గాలు చెప్పుకొచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications