IPL 2020: ఏడుగురు మాత్రమే, వేలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టిదే!

హైదరాబాద్: 2016లో ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్రం నుంచి కూడా నిలకడగా ప్రదర్శన చేస్తూ వస్తోంది. అయితే, వచ్చే సీజన్ కోసం గురువారం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను సొంతం చేసుకుంది.
అయితే, ఈ వేలంలో సన్‌రైజర్స్ ప్రధాన కొనుగోలు మాత్రం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్. ఆ తర్వాత వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్. ఈ ఇద్దరు విదేశీ ఆల్‌రౌండర్లతో పాటు అండర్ -19 స్టార్స్ ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్‌లను వేలంలో కొనుగోలు చేసింది.
వీరితో పాటు టీమండియాకు ఇంకా ఎంపికవనటువంటి సంజయ్ యాదవ్, భావనక సందీప్, అబ్దుల్ సమద్ రూపంలో మరో ముగ్గురిని సన్‌రైజర్స్ యాజమాన్యం వేలంలో కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టుని ఒక్కసారి పరిశీలిద్దాం....
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:
బ్యాట్స్‌మెన్: కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, విరాట్ సింగ్ (రూ .1.9 కోట్లు), ప్రియామ్ గార్గ్ (రూ. 1.9 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ .20 లక్షలు).
ఆల్ రౌండర్లు: మిచెల్ మార్ష్ (రూ .2 కోట్లు), ఫాబియన్ అలెన్ (రూ .50 లక్షలు), విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సంజయ్ యాదవ్ (రూ .20 లక్షలు).
వికెట్ కీపర్లు: జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్సవ్ గోస్వామి.
బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, టి నటరాజన్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్, భావనక సందీప్ (రూ .20 లక్షలు).

వేలానికి ముందు విడుదల చేసిన ఆటగాళ్ళు:
షకీబ్ అల్ హసన్ (ఐసీసీ ఏడాది పాటు నిషేధం విధించింది), దీపక్ హుడా, మార్టిన్ గుప్టిల్, రికీ భూయ్, యూసుఫ్ పఠాన్.
వేలంలో అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ - రూ. 2 కోట్లు), వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్-రూ. 50 లక్షలు, ఇండియా అండర్-19 స్టార్స్ ప్రియామ్ గార్గ్-రూ. 1.9 కోట్లు, విరాట్ సింగ్-1.9 కోట్లు

ఖర్చు చేసిన మొత్తం నగదు
ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదాబాద్ వద్ద రూ. 17 కోట్లు ఉంది. అయితే, ఏడుగురు ఆటగాళ్ల కోసం రూ. 6.9 కోట్లు ఖర్చు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications