IPL 2020: తొలి బోణి ముంబై ఇండియన్స్‌దే, వేలం తర్వాత పూర్తి జట్టిదే!

హైదరాబాద్: ఢిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తక్కువ నగదుతో ఐపీఎల్ వేలం బరిలో నిలిచింది. అయినప్పటికీ తమ జట్టుని బలోపేతం చేసే ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్ కోట్లు కుమ్మరించింది. గురువారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాడిగా నాథన్ కౌల్టర్ నైల్ నిలిచాడు.
వేలంలో ముంబై ఇండియన్స్ మొత్తం ఆరుగురు ఆటగాళ్లను సొంతం చేసుకోగా ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కౌల్టర్ నైల్ కోసం రూ. 8.0 కోట్లు వెచ్చించింది. గురువారం నాటి వేలంలో ఎనిమిది ప్రాంఛైజీలు 62 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా... ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. వేలంలో ఎనిమిది జట్లు మొత్తం రూ. 140.3 కోట్లు ఖర్చు చేశాయి.
నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్ కోసం గట్టి ప్రణాళికతో వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు వేలంలో క్రిస్ లిన్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్రికెటర్ గత సీజన్లలో కేకేఆర్‌కు ఆడాడు.
ఫించ్ హిట్టర్‌గా పేరొందించిన క్రిస్ లిన్‌ను వేలంలో కనీసధర రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వేలంలో సౌరభ్ తివారీ(రూ. 50 లక్షలు), దిగ్విజయ్ దేశ్‌ముఖ్(రూ. 20 లక్షలు), ప్రిన్స్ బల్వంత్‌రాయ్(రూ. 20 లక్షలు), మోహ్‌సిన్ ఖాన్(రూ. 20 లక్షలు)లను ముంబై కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలం తర్వాత ముంబై ఇండియన్స్‌ను ఒక్కసారి పరిశీద్దాం...
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, క్వింటన్ డి కాక్, కీరోన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ మెక్‌క్లెనాగన్, క్రునాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్ చాహర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, జయంత్ యాదవ్ అనుకుల్ రాయ్, నాథన్ కౌల్టర్-నైలు, క్రిస్ లిన్, మొహ్సిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్ముఖ్, సౌరభ్ తివారీ, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్, ధావల్ కులకర్ణి, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు:
నాథన్ కౌల్టర్-నైలు, క్రిస్ లిన్, మొహ్సిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్ ముఖ్, సౌరభ్ తివారీ, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్
వేలానికి ముందు విడుదల చేసిన ఆటగాళ్లు
యువరాజ్ సింగ్, ఎవిన్ లూయిస్, ఆడమ్ మిల్నే, జాసన్ బెహ్రెండోర్ఫ్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, అల్జారీ జోసెఫ్, బరీందర్ స్రాన్, రసిఖ్ సలాం, పంకజ్ జస్వాల్

అత్యధిక ధర
వేలంలో అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కౌల్టర్‌నైల్ (రూ.8 కోట్లు), క్రిస్ లిన్ (2 కోట్లు)

వేలంలో ఖర్చు చేసిన మొత్తం
వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వద్ద ఉన్న మొత్తం నగదు రూ. 13.05 కోట్లు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అత్యల్ప నగదు ఉన్న ప్రాంఛైజీ ముంబైనే. గురువారం జరిగిన వేలంలో మొత్తం ఆరుగురు ఆటగాళ్ల కోసం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ రూ.11.2 కోట్లు ఖర్చు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications