IPL 2020: అత్యధిక ధర పలికిన ఆటగాడు కోల్‌కతాలోనే, వేలం తర్వాత పూర్తి జట్టిదే!

హైదరాబాద్: ఐపీఎల్ వేలం తర్వాత క్రికెట్ అభిమానులు ఎక్కువగా చర్చింఛుకున్న ఆటగాడు ప్యాట్ కమిన్స్. గురువారం జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్ కళ్లు చెదిరే దరకు అమ్ముడుపోయాడు. తీవ్ర పోటీ మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.15.50 కోట్లకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ చరిత్ర సృష్టించాడు.
ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం తొమ్మిది మందిని కొనుగోలు చేసేందుకు గాను రూ. 27.25 కోట్లు వెచ్చించింది. ప్యాట్ కమిన్స్‌ను భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేయడాన్ని కోల్‌కతా యాజమాన్యం సమర్ధించుకుంది. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో ప్యాట్ కమిన్స్ ప్రధాన బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేశాడు.
ప్యాట్ కమిన్స్ ప్రత్యేకత ఏంటంటే బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా ముప్పుతిప్పలు పెట్టగలడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో వేసే బంతులకు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లాంటి వారి వద్ద సమాధానం ఉండదు. ఇక అవసరం అయినపుడు బ్యాటుతోనూ మెరవగలడు. అందుకే అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి.
ఆ తర్వాత వేలంలో కోల్‌కతా ఫ్రాంఛైజీ ఇయాన్ మోర్గాన్(రూ. 5.25 కోట్లు), వరుణ్ చక్రవర్తి(రూ. 4.0 కోట్లు), టామ్ బాంటన్(రూ. 1.0 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ. 60 లక్షలు), క్రిస్ గ్రీన్(రూ. 20 లక్షలు), నిఖిల్ నాయక్(రూ. 20 లక్షలు), ప్రవీణ్ తాంబే(రూ. 20 లక్షలు), సిద్ధార్థ్(రూ. 20 లక్షలు)లను కొనుగోలు చేసింది. వేలం తర్వాత కోల్‌కతా జట్టుని ఒక్కసారి పరిశీలిద్దాం...
వేలం తర్వాత కోల్‌కతా పూర్తి జట్టు
దినేష్ కార్తీక్ (కెప్టెన్), ఇయాన్ మోర్గాన్, పాట్ కమ్మిన్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, షుబ్మాన్ గిల్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రానా, రింకు సింగ్, ప్రసీద్ కృష్ణ, సందీప్ వారియర్, హ్యారీ గుర్నీ, కమలేష్ శివమోవగ్, ఎం సిద్ధార్థ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, టామ్ బాంటన్, నిఖిల్ నాయక్, క్రిస్ గ్రీన్, ప్రవీణ్ తంబే

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు:
పాట్ కమ్మిన్స్ (రూ. 15.50 కోట్లు), ఇయాన్ మోర్గాన్ (రూ. 5.25 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 4 కోట్లు), టామ్ బాటన్ (రూ. 1 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 60 లక్షలు), ఎం సిద్దార్థ్ (రూ. 20 లక్షలు), నిఖిల్ నాయక్(రూ. 20 లక్షలు)

వేలానికి ముందు విడుదల చేసిన ఆటగాళ్లు
క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, పియూష్ చావ్లా, కార్లోస్ బ్రాత్‌వైట్, జో డెన్లీ, యర్రా పృథ్వీరాజ్, నిఖిక్ నాయక్, కెసి కారియప్ప, మాథ్యూ కెల్లీ, శ్రీకాంత్ ముంధే
వేలంలో ఖర్ఛు చేసిన మొత్తం నగదు
వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద రూ. 35.65 కోట్ల నగదు ఉంది. అయితే, వేలంలో మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడం కోసం రూ. 27.25 కోట్లు ఖర్చు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications