IPL 2020: ఈ సారైనా టైటిల్ నెగ్గేనా, వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టిదే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం కోల్‌కతా వేదికగా గురువారం జరిగిన వేలం ముగిసింది. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు మొత్తం 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉండటం విశేషం. ఈ వేలంలో ఫ్రాంఛైజీలు మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేశాయి.
గురువారం నాటి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది ఆటగాళ్లను కొనుగోలు చేయగా... రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 11 మందిని కొనుగోలు చేసింది. వేలం ముగిసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల సంఖ్య 22కు చేరగా... అత్యల్ప ఆటగాళ్లు ఉన్న జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల సంఖ్య 21గా ఉంది.
వెస్టిండిస్ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మెయిర్‌కు అత్యధికంగా రూ. 7.75 కోట్లు వెచ్చించి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది హెట్‌మెయిర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వేలంలో ఇతడి కోసం ఫ్రాంఛైజీలు తెగ పోటీపడ్డాయి. ఆ తర్వాత మార్కస్ స్టొయినిస్(రూ. 4.8 కోట్లు) రెండో ఆత్యధిక ధర పలికాడు.
వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టును ఒక్కసారి పరిశీలిద్దాం....
వేలం తర్వాత ఢిల్లీ పూర్తి జట్టు
బ్యాట్స్ మెన్: శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్ (రూ. 7.75 కోట్లు), అజింక్య రహానె (రూ. 5.25 కోట్లు), శిఖర్ ధావన్, జాసన్ రాయ్ (రూ. 1.50 కోట్లు), పృథ్వీ షా. బౌలర్లు: కగిసో రబాడా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, అవేష్ ఖాన్, మోహిత్ శర్మ (రూ. 50 లక్షలు), సందీప్ లామిచానే, తుషార్ దేశ్‌పాండే (రూ. 20 లక్షలు).
ఆల్ రౌండర్లు: రవిచంద్రన్ అశ్విన్ (రూ. 7.60 కోట్లు), ఆక్సర్ పటేల్, మార్కస్ స్టోయినిస్ (రూ. 4.80 కోట్లు), క్రిస్ వోక్స్ (రూ. 1.50 కోట్లు), కీమో పాల్, హర్షల్ పటేల్, లలిత్ యాదవ్ (రూ. 20 లక్షలు).
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, అలెక్స్ కారీ (రూ. 2.40 కోట్లు).

వేలానికి ముందు విడుదల చేసిన ఆటగాళ్లు
అంకుష్ బెయిన్స్, బి అయ్యప్ప, క్రిస్ మోరిస్, కోలిన్ ఇంగ్రామ్, కోలిన్ మున్రో, హనుమా విహారీ, జలాజ్ సక్సేనా, మంజోత్ కల్రా, నాథూ సింగ్.

వేలానికి ముందు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఇశాంత్ శర్మ, కగిసో రబాడా, రిషబ్ పంత్, కీమో పాల్, పృథ్వీ షా, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, సందీప్ లామిచనేను నిలబెట్టారు. అజింక్య రహానె, ఆర్ అశ్విన్ వర్తకం చేయగా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, రాహుల్ టెవాటియా. వేలానికి ముందు జట్టుని బలోపేతం చేసుకునేందుకు గాను అశ్విన్, రహానేను ట్రేడింగ్ ద్వారా జట్టులో చేర్చుకున్నారు.
వేలంలో అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు
గురువారం నాటి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను రూ .7.75 కోట్లకు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను రూ .4.80 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరి తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా అలెక్స్ కారీ (రూ. 2.40 కోట్లు) ఉన్నాడు. ఇక, ఇంగ్లాండ్ క్రికెటర్లు జాసన్ రాయ్, క్రిస్ వోక్స్‌ను కూడా సరసమైన ధరకే పొందగలిగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications