IPL 2020: చెన్నై సరిగ్గా చూసి కొనుగోలు చేసింది, వేలం తర్వాత పూర్తి జట్టిదే!

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత విజయవంతమైన జట్టు, మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. వేలంలో భాగంగా తొలుత శామ్ కర్రన్‌ను చెన్నై రూ. 5.5 కోట్లకు దక్కించుకుంది.
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత టీమిండియా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాను రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంపాటలో ఆచితూచి వ్యవహరించే చెన్నై పియూష్ చావ్లా కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం ఆశ్చర్యం కలిగించింది.
అయితే, ఈ ఎంపిక వెనుక ఆ జట్టు కెప్టెన్ ధోని మాస్టర్ ప్లాన్ ఉందని అందరికీ అర్ధమవుతుంది. వచ్చే సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఓ భారత ఆటగాడికి దక్కిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అనంతరం కనీస ధఱ రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌ఉడ్‌ను చెన్నై కొనుగోలు చేసింది.
మరికాసేపట్లో వేలం ముగుస్తుందనగా... తమిళనాడు ఎడమచేతివాటం స్పిన్నర్ సాయి కిశోర్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టుని ఒక్కసారి పరిశీలిద్దాం....
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు:
బ్యాట్స్ మెన్: ఫా డు ప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా
బౌలర్లు: హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కెఎమ్ ఆసిఫ్, లుంగి ఎంగిడి, శార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా (రూ. 6.75 కోట్లు), జోష్ హజిల్‌వుడ్ (రూ. 2 కోట్లు), ఆర్ సాయి కిషోర్ (రూ. 20 లక్షలు)
ఆల్ రౌండర్లు: షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మోను కుమార్, కర్న్ శర్మ, సామ్ కుర్రాన్ (రూ. 5.5 కోట్లు)
వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), ఎన్ జగదీసన్

వేలానికి ముందు విడుదల చేసిన ఆటగాళ్ళు
మోహిత్ శర్మ, సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లీ, ధ్రువ్ షోరే, స్కాట్ కుగ్గెలీజ్న్, చైతన్య బిష్ణోయ్
వేలంలో అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు
ఇండియా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా (రూ. 6.75 కోట్లు), ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ (రూ. 5.50 కోట్లు), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ (రూ. 2 కోట్లు)

ఐపీఎల్ 2020 వేలంలో ఖర్చు చేసిన మొత్తం నగదు
వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 14.60 కోట్లు ఉన్నాయి. అయితే, వేలంలో కేవలం నలుగురు ఆటగాళ్ల కోసం రూ. 14.45 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు చెన్నై వద్ద కేవలం 15 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications