IPL 2020: చెన్నై ఆటగాళ్లకు షాక్.. ఫ్యామిలీస్‌కి నో ఎంట్రీ!!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు సంబంధించిన అధికారిక పత్రాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మంగళవారం అందుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది లీగ్‌ను యూఏఈలో జరుపాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్ జరగనుంది. కరోనా వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరగనున్నాయి. ఇక ఫ్రాంచైజీలు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాయి.

ఫ్యామిలీస్‌కి నో ఎంట్రీ!
ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అందరికంటే ముందుగానే యూఏఈకి పయనం కానుంది. అయితే చెన్నై ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి యూఏఈ వచ్చేందుకు అనుమతి లేదని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. మంగళవారం కాశీ విశ్వనాథన్ ఇండియా టుడేతో మాట్లాడుతూ... 'లీగ్ మొదటి భాగంలో ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి అనుమతి లేదు. జట్టుతో పాటు ఫ్యామిలీస్ యూఏఈకి రావడం లేదు. యూఏఈ పరిస్థితులను బట్టి రెండో భాగంలో ఫ్యామిలీస్‌ని అనుమతించాలా? వద్దా? అని ఆనిర్ణయం తీసుకుంటాం' అని తెలిపారు.

బబుల్ రూల్స్ పాటించాల్సిందే:
కుటుంబాలను యూఏఈకి తీసుకెళ్లడం లేదా అనేది ప్రాంఛైజీల ఇష్టమే అని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే కుటుంబాలు వస్తే మాత్రం ఆటగాళ్లతో పాటు వారు కూడా బబుల్ రూల్స్ పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. యూఏఈకి బయల్దేరే ముందు 8 జట్ల యాజమాన్యం, ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని వారం రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన వారు మాత్రమే యూఏఈకి బయల్దేరి వెళ్లనున్నారు. కుటుంబాలకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. యూఏఈకి వెళ్లిన వెంటనే అక్కడ ఒకసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆపై 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. తొలి వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పరీక్షలు చేయించుకొని అన్నీ నెగెటివ్‌గా తేలాలి. అప్పుడే బయో బబుల్‌లోకి చేర్చుతారు.

21న దుబాయ్‌కు:
ఫ్రాంచైజీలన్నీ ఏర్పాట్లలో మునిగిపోయిన వేళ.. చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే ముందుగా ఈ నెల 21న దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. 'ఆగస్టు 16 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజాతో పాటు మొత్తం జట్టు ఆటగాళ్లు ఆగస్టు 21న యూఏఈకి బయలుదేరనుంది' అని టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఐపీఎల్ 2022 వరకు ధోనీ తమకు అందుబాటులో ఉంటాడని కాశీ విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేశారు. 2020, 2021 సీజన్లలో కచ్చితంగా పాల్గొంటాడని, 2022లో సైతం ఆడతాడని తాము అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

ఎలాంటి పిచ్‌లపైనైనా ఆడుతారు:
అభిమానులు యూఏఈకి ప్రయాణించే అవకాశం లేదని కాశీ విశ్వనాథన్ అన్నారు. అయితే ఐపీఎల్ 2020 సమయంలో చెన్నై అభిమానుల కోసం సోషల్ మీడియా మరియు వెబ్ టీం పనిచేస్తాయని చెప్పారు. బయో-బబుల్ వాతావరణంలో అభిమానులకు అనుమతి లేదన్నారు. యూఏఈ పరిస్థితులను చెన్నై ఆటగాళ్లు అర్ధం చేసుకుంటారని, త్వరగానే అక్కడి వాతావరణంకు అలవాటు పడతారని విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేసారు. ఎలాంటి పిచ్‌లపైనైనా మా ఆటగాళ్లు బాగా ఆడుతారన్నారు.
రామ్ మందిర్‌ని చూసేందుకు తప్పకుండా భారత్‌కి వస్తా: పాక్ క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications