Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR: మ్యాచ్‌ విన్నర్లతో బ్యాటింగ్‌ చేయడం ఒత్తిడితో కూడుకున్న పని: మోర్గాన్‌

IPL 2020: Eoin Morgan says Difficult to bat up the order as we have number of match-winners

షార్జా: శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 229 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఓటమిని చవిచూసింది. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్‌ (44; 18 బంతుల్లో ఒక ఫోర్‌, 5 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (36;16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సలర్లు) రాణించారు. ఇద్దరూ కోల్‌కతాను దాదాపు విజయపుటంచుల వరకూ తీసుకెళ్లారు. కానీ చివరలో ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.

తాజాగా ఇయాన్‌ మోర్గాన్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి మ్యాచ్‌ విన్నర్లతో బ్యాటింగ్‌ చేయడమంటే కష్టమైన పని అని‌ ‌పేర్కొన్నాడు. 'కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌లో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్‌ చేయడమంటే చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌తో. అతను ఒక అద్భుతమైన బ్యాట్స్‌మన్‌. సునీల్‌ నరైన్ కూడా మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడగలడు. అతనెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు. ఒక ఆటగాడికి ఉండాల్సింది కూడా అదే' అని మోర్గాన్‌ అన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ ఓటమిపై ఇయాన్‌ మోర్గాన్ స్పందిస్తూ... ఆ మ్యాచ్‌లో ఢిల్లీ బాగా ఆడిందని, ఆ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారని ఇంగ్లండ్ కెప్టెన్‌ పేర్కొన్నాడు. కోల్‌కతా తరఫున ఆడుతున్న మోర్గాన్ ఐపీఎల్ 2020లో అద్భుతంగా ఆడుతున్నాడు.‌ గత మూడు మ్యాచుల్లో 42 (29), 34 (23), 44 (18) మెరుపులు మెరిపించాడు. రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు.

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి, మరో రెండింట్లో విజయం సాధించింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ పరుగులు చేయడంలో విఫలం అవుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక సారథ్యంలో కూడా తేలిపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ రోటేషన్ విషయంలోనూ తడబడుతున్నాడు. గౌతమ్ గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా విజయాల రేటు 56.48గా ఉండగా.. కార్తీక్‌ జట్టు పగ్గాలు అందుకున్నాక అది 51.52కు పడిపోయింది.

దినేశ్ కార్తీక్ విఫలమవుతున్న నేపథ్యంలో కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలు ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తన కెప్టెన్సీలో ఇంగ్లండ్‌కు తొలిసారిగా ప్రపంచకప్‌ తెచ్చిపెట్టిన రికార్డు కూడా అతనికి ఉంది. ఆ అనుభవం కోల్‌కతా జట్టుకు ఉపయోగపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Monday, October 5, 2020, 20:31 [IST]
Other articles published on Oct 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+