
డీకేకే క్రెడిట్:
ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. నిజానికి చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతుందనుకునే దశలో కోల్‌కతా అద్భుత విజయాలు సాధించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చివరి 10 ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన కోల్‌కతా బౌలర్లు జట్టుకు ఊహించని విజయాన్ని అందించారు. ఓ దశలో 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 90 రన్స్ చేసిన చెన్నైను కోల్‌కతా బౌలర్లు 157 పరుగులకే పరిమితం చేయడం విశేషం. చివరలో కెప్టెన్ దినేశ్ కార్తీక్.. సునీల్ నరైన్, ప్రసిధ్ క్రిష్ణలను బాగా ఉపయోగించుకున్నాడు. కచ్చితంగా ఈ క్రెడిట్ డీకేకే దక్కుతుంది.

వనరులన్నీ ఉపయోగించాం:
ఐదు మ్యాచ్‌ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న దినేష్ కార్తీక్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్, సారథిగా ఆకట్టుకున్నాడు. అయితే తన విజయాల వెనకాల ఉన్న కారణాన్ని డీకే వెల్లడించాడు. పంజాబ్ మ్యాచ్ అనంతరం కార్తీక్ మాట్లాడుతూ... 'కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఆడుతున్నంతసేపు మ్యాచ్ పంజాబ్ చేతిల్లోనే ఉంది. ఆ సమయంలో మ్యాచ్‌ను మావైపు తిప్పుకోవడానికి ఉన్న వనరులన్నీ ఉపయోగించాం. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా బౌలింగ్ చేశాడు' అని ప్రశంసించాడు.

మోర్గాన్ సలహాలు ఉపయోగపడ్డాయి:
'ఈ సీజన్‌లో తొలి గేమ్ ఆడుతున్న ప్రసిద్ధ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ప్రత్యేకంగా రెండో స్పెల్‌లో ఆకట్టుకున్నాడు. ఇక నరైన్ ఎప్పుడూ అండగా నిలుస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి బ్రేక్‌లు ఇస్తాడు. అయితే ఈ క్రెడిట్ అంతా ఇయాన్ మోర్గాన్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌కే చెందుతుంది. క్లిష్ట సమయంలో మోర్గాన్ సలహాలు ఉపయోగపడ్డాయి. అదే సమయంలో మెకల్లమ్ చేసిన వర్కౌట్ కూడా ఉపయోగపడింది. మోర్గాన్, మెకల్లమ్‌లు మా జట్టులో ఉండటం నా అదృష్టం. వీరిద్దరూ వరల్డ్ అత్యుత్తమ కెప్టెన్లు, టీ20 స్పెషలిస్టులు. కింగ్స్ పంజాబ్‌పై విజయంలో వీరి పాత్ర వెలకట్టలేనిది. వీరిద్దరికీ ధన్యవాదాలు' అని డికే తెలిపాడు.

మెక్‌కల్లమ్ ప్రోత్సాహంతోనే:
దినేష్ కార్తీక్ పంజాబ్‌పై మెరుపు బ్యాటింగ్‌తో 29 బంతుల్లోనే 56 రన్స్‌తో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. కోల్‌కతా కోచ్ మెక్‌కల్లమ్ ప్రోత్సాహంతోనే తాను బ్యాటింగ్‌లో రాణించానని చెప్పాడు. తాను ఏ స్థానంలో ఆడితే జట్టు విజయానికి ఉపయోగపడగలనో అక్కడ ఆడేలా చేసిన ఘనత కోచ్‌దేనన్నాడు. మోర్గాన్ లాంటి ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ పక్కన ఉండడం సానుకూలంశామన్నాడు. మోర్గాన్ పాజిటివ్‌గా ప్రతి విషయాన్ని ఆలోచిస్తాడని, అలాంటి గొప్ప కెప్టెన్ కోల్‌కతా జట్టులో ఉండటం తన అదృష్టమని కార్తీక్ తెలిపాడు.


Click it and Unblock the Notifications
