సరిపోయారిద్దరు: విరూష్క రొమాంటిక్ వీడియో: గ్రౌండ్ నుంచే తిన్నావా? అంటూ సిగ్నల్: క్యూట్ రిప్లై

IPL 2020 : Virat Kohli Asks Anushka Sharma If She Has Eaten From The Field || Oneindia Telugu

దుబాయ్: విరూష్క జోడీకి హైప్రొఫైల్ సెలెబ్రిటీస్‌గా గుర్తింపు ఉంది. క్రికెట్‌లో విరాట్ కోహ్లీ శిఖరంలా ఎదిగితే..అతని భార్య అనూష్క శర్మ.. బాలీవుడ్‌ను ఏలుతోంది. వారిద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుంది. యాడ్ ఫిల్మ్స్‌లో గానీ, ఫొటో షూట్‌లో గానీ.. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపిస్తుంటారు. టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా.. అక్కడికి వెళ్తుంటుంది అనూష్క శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఏర్పాటు చేసినా.. పక్కనే కావడంతో ప్రతి వీకెండ్‌కూ అనూష్మ శర్మ ఎమిరేట్స్ విమానం ఎక్కేస్తున్నారు. శని, ఆదివారాల్లో అక్కడే మకాం వేస్తున్నారు. తన భర్త కేప్టెన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వెంటే ఉంటున్నారు. ఈ ఆదివారం కూడా ఆమె దుబాయ్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కనిపించారు. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయారామె.

అదేరోజు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఎప్పుడూ ఓడిపోయే చెన్నై సూపర్ కింగ్స్.. ఈ మ్యాచ్‌లో గెలిచింది. అది వేరే విషయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్. తమ ఇన్నింగ్ ముగిసిన తరువాత ఫీల్డింగ్ చేయడానికి గ్రౌైండ్‌లోకి వచ్చిన సమయంలో విరాట్ కోహ్లీ.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద నిల్చున్న అనూష్క శర్మను చూసి.. భోంచేశావా? అంటూ సంకేతాలు ఇచ్చాడు.

దీనికి ఆమె అక్కడి నుంచి క్యూట్‌గా రిప్లయ్ ఇచ్చారు. తాను భోంచేశానంటూ థమ్సప్ చేశారు. నువ్వొచ్చిన తరువాత మళ్లీ తిందాం.. అంటూ ఆమె సంకేతాలను ఇచ్చారు. ఈ రొమాంటిక్ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారింది. అనూష్క శర్మ గర్భంతో ఉన్నారు. అందుకే ఆమె ఆరోగ్యం పట్ల విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 29, 2020, 12:39 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X