Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL నుంచి ధోనీ రిటైర్ అవుతున్నాడా..? అవును అని చెప్పేందుకు ఇదిగో రుజువులు..!

IPL 2020: Dhoni gifts his Jersey to Pandya brothers,Netizens say this is his final IPL season

దుబాయ్: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ 8వ ఓటమి చూసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం ధోనీసేన మూటగట్టుకుంది. ఇక పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది ఎల్లో ఆర్మీ. చెన్నై ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. మరీ దారుణంగా ఓడిపోవడంతో ఫ్యాన్స్ టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా ఓటమితో ప్లే ఆఫ్స్‌ తలపులు చెన్నై సూపర్ కింగ్స్‌కు దాదాపు మూసకుపోయినట్లే కనిపిస్తోంది.

 ధోనీ సేనకు ఘోర పరాభవం

ధోనీ సేనకు ఘోర పరాభవం

ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఇలాంటి ఓటములు చాలా బాధకు గురిచేస్తాయని ఈ సీజన్‌ చెన్నై జట్టుకు కలిసిరాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక రానున్న మూడు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపు కోసం కృషి చేస్తుందని ధోనీ చెప్పాడు.ఇక ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 180 పరుగులు మాత్రమే చేశాడు.రానున్న మ్యాచ్‌లకు జట్టు మంచి ప్రణాళికతో సిద్ధం అవ్వాలని చెప్పాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ నుంచి కూడా ధోనీ రిటైర్ అవుతాడంటూ చాలామంది నెటిజెన్లు ఈ మాజీ టీమిండియా కెప్టెన్‌ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు.

 జెర్సీలను గిఫ్ట్‌గా ఇస్తున్న ధోనీ

జెర్సీలను గిఫ్ట్‌గా ఇస్తున్న ధోనీ

ఇక ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ అవుతాడని చెప్పేందుకు కొన్ని సందర్భాలను కూడా నెటిజెన్లు వివరిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ తన జెర్సీని జోస్ బట్లర్‌కు కానుకగా ఇచ్చాడు. అంతేకాదు ముంబై ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా మరియు కృనాల్ పాండ్యాలకు కూడా ధోనీ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. నెంబర్ 7‌తో పాటు ధోనీ అని పేరు రాసిన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు.200వ ఐపీఎల్ గేమ్ ఆడిన ధోనీ మ్యాచ్ అనంతరం జోస్‌బట్లర్‌కు తన జెర్సీని బహుమతిగా ఇచ్చినట్లు రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఇక నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం పాండ్యా సోదరులకు ధోనీ నుంచి అపూర్వమైన కానుక లభించిందని చెబుతూ హార్ధిక్ మరియు కృనాల్ పాండ్యాలు ధోనీ జెర్సీతో దిగిన ఫోటోను ఐపీఎల్ నిర్వాహకులు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌పై పోస్టు చేశారు.

నెటిజెన్లు ఏం చెబుతున్నారు..

ఇదిలా ఉంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్యాన్స్ ఒక్కింత అసహనానికి గురవుతున్నారు. ధోనీ ఇలా తన జెర్సీలను ఇతర జట్ల ప్లేయర్లకు ఇవ్వడం చూస్తే ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ధోనీ జెర్సీతో ఫోటోలకు ఫోజులిస్తున్నారంటే ఇదే ధోనీకి చివరి సీజన్ కానుందా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక ధోనీకి ఐపీఎల్ చివరి ఏడాది కానుందా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, October 24, 2020, 14:52 [IST]
Other articles published on Oct 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+