న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: లక్నోని సెకండ్ హోంగా ప్రకటించాలంటూ ఢిల్లీ Vs పంజాబ్ మధ్య ఫైట్!

IPL 2020: Delhi Capitals and Kings XI Punjab battle it out to make Lucknow second home

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, వేలం ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీల మధ్య యుద్ధం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. లక్నోలోని ఎకానా స్టేడియాన్ని తమ రెండో హోం గ్రౌండ్‌గా చేసుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్రయత్నిస్తున్నాయి.

ఎకానా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సిన్హా ఐఎఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని... ఇది ఫ్రాంచైజీల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయమని అన్నారు. ఈ విషయంలో బీసీసీఐ అలాగే ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యుపీసీఎ) నిర్ణయం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు.

నా ముందు బుమ్రా బేబి బౌలర్, నేనైతే చితకబాదేవాడిని: పాక్ మాజీ క్రికెటర్నా ముందు బుమ్రా బేబి బౌలర్, నేనైతే చితకబాదేవాడిని: పాక్ మాజీ క్రికెటర్

"మేము కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్ ఫ్రాంఛైజీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీతోనూ మాట్లాడుతున్నాం. దీనిపై మేము ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. రెండు ఫ్రాంచైజీలతో జరిగే చర్చలు కాకుండా బిసిసిఐ మరియు యుపిసిఎ యొక్క అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాలి" అని ఆయన తెలిపారు.

On this day, 2009: తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్సైన సెహ్వాగ్ (వీడియో)On this day, 2009: తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్సైన సెహ్వాగ్ (వీడియో)

"ఇది దేశంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఇదొకటి. ఈ కారణం చేతనే ఫ్రాంఛైజీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అలాగే, ఈ వేదికలో టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది" అని ఉదయ్ సిన్హా తెలిపారు. రికార్డు ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2019 ఎడిషన్ కంటే ముందే లక్నోను తమ రెండో హోం గ్రౌండ్‌గా ప్రకటించాలని బీసీసీఐ కోరింది.

Story first published: Wednesday, December 4, 2019, 18:46 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X