Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: ధావన్‌ భాయ్‌.. ఎప్పటిలాగే డీఆర్‌ఎస్‌ కోరడం మర్చిపోయా!!

IPL 2020, DC vs SRH: Yuvraj Singh trolls Shikhar Dhawan for not reviewing dismissal

అబుదాబి: 13 ఏళ్లలో తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్‌ అడుగుపెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన క్వాలిఫయిర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 17 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. లీగ్‌ చరిత్రలో తుదిపోరుకు చేరడం ఢిల్లీకి ఇదే తొలిసారి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (78; 50 బంతుల్లో, 6×4, 2×6) అర్ధ శతకంతో అదరగొట్టాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. కేన్ విలియమ్సన్‌ (67; 45 బంతుల్లో, 5×4, 4×6) పోరాడాడు. ముంబై-ఢిల్లీ జట్ల మధ్య మంగళవారం లీగ్‌ ఫైనల్ జరగనుంది.‌

ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడంలో శిఖర్‌ ధావన్‌ కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. హాఫ్ సెంచరీ అనంతరం 19వ ఓవర్‌లో గబ్బర్ ఔటయ్యాడు. పేసర్ సందీప్‌ శర్మ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే అంపైర్‌ ఔటివ్వకముందే.. అతడు క్రీజు వదిలినట్లు కనిపించింది. కానీ రీప్లేలో ఆ బంతి ఆఫ్‌స్టంప్‌ అవతలికి వెళ్లినట్లు తేలింది.

శిఖర్ ధావన్‌ కనీసం డీఆర్‌ఎస్‌కు వెళ్లకపోవడం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో గబ్బర్‌ను ఉద్దేశించి యువీ ట్విటర్‌లో ట్రోల్‌ చేశాడు. 'ఢిల్లీ ఇన్నింగ్స్‌లో చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. టీ నటరాజన్‌, సందీప్‌ శర్మ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఒత్తిడిని తట్టుకుని బాగా బౌలింగ్ చేశారు. శిఖర్ ధావన్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ధావన్‌ భాయ్‌.. ఎప్పటిలాగే డీఆర్‌ఎస్‌ కోరడం మర్చిపోయా' అని చురక అంటించాడు. గబ్బర్‌ను యువీ పొగుడుతూనే ట్రోల్ చేశాడు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై రెండు సార్లు ఛేజింగ్‌లో ఓడిన ఢిల్లీ.. కీలక మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడ్డ పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మార్కస్ స్టొయినిస్‌.. శిఖర్ ధావన్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. హైదరాబాద్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా క్యాపిటల్స్‌కు కలిసొచ్చాయి. ఓపెనర్లు ఎడాపెడా బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధావన్ ఆఖర్లో కాస్త నెమ్మదిగా ఆడి ఔట్ అయ్యాడు. ధావన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్‌ అత్యధికంగా 569 పరుగులు సాధించాడు.

Story first published: Monday, November 9, 2020, 11:20 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+