Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC v SRH: ఢిల్లీని ఆపతరమా.. సన్‌రైజర్స్‌ బోణీ కొట్టేనా?.. హ్యాట్రిక్‌ నమోదవుతుందా!!

IPL 2020, DC vs SRH Preview: probable XI, match prediction and pitch report

హైదరాబాద్: ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం మంగళవారం మరో పోరుకు సిద్ధమైంది. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. రెండు వరుస పరాజయాలతో సతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఢిల్లీ దూసుకుపోతుంటే.. అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన చేస్తూ సన్‌రైజర్స్‌ డీలాపడిపోయింది. ఢిల్లీ గెలిచినా, సన్‌రైజర్స్‌ ఓడినా.. హ్యాట్రిక్‌ నమోదు కానుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి లుక్కేద్దాం.

మిడిలార్డర్ సమస్య:

మిడిలార్డర్ సమస్య:

ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. సన్‌రైజర్స్‌కు మొదటి నుంచి మిడిలార్డర్ సమస్య ఉంది. దీనికి తోడు లోయర్ ఆర్డర్ నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించడం లేదు. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌ జోడీపైనే సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఒక్కరు విఫలమయినా భారం మొత్తం మరొకరిపై పడుతోంది. మనీశ్‌ పాండే రాణించడం సానుకూలాంశం. గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన కేన్‌ విలియమ్సన్‌ ఇవాళ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొహమ్మద్ నబీపై వేటు పడనుంది.

లయ అందుకోని భువీ:

లయ అందుకోని భువీ:

దేశీ ఆటగాళ్లు వృద్ధిమాన్‌ సాహా, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారు. వీరు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించే ప్రియమ్‌ గార్గ్ బదులు విజయ్ శంకర్‌ ఆడే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లనే సన్‌రైజర్స్ నమ్ముకుంది. అయితే వీరిద్దరూ అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా గాడిలో పడితే టోర్నీలో బోణీ కొట్టొచ్చు. సిద్ధార్థ్‌ కౌల్‌, టీ నటరాజన్‌ కూడా సత్తాచాటితే సన్‌రైజర్స్ కోలుకునే అవకాశం ఉంటుంది.

ఊపుమీదున్న ఢిల్లీ:

ఊపుమీదున్న ఢిల్లీ:

శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని యువ ఢిల్లీ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ను తర్వాత చెన్నై జట్టును మట్టికరిపించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌తో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. హిట్టర్లు హెట్‌మైయిర్‌‌, స్టొయినిస్‌ ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో కాగిసో రబాడ, అమిత్‌ మిశ్రా, అన్రిచ్ నోర్జె రాణిస్తున్నారు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్‌ ఇషాంత్ ‌శర్మ గాయాల నుంచి కోలుకున్నారు. నెట్స్‌లో బౌలింగ్‌ కూడా చేశారు. మరి ఢిల్లీ విన్నింగ్‌ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతుందా.. లేక ఏమైనా మార్పులు చేస్తుందో చూడాలి.

హైదరాబాద్‌ 8, ఢిల్లీ 6:

హైదరాబాద్‌ 8, ఢిల్లీ 6:

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటి వరకు 15సార్లు ఎదురుపడ్డాయి. కాగా అందులో హైదరాబాద్‌ 8, ఢిల్లీ 6 మ్యాచుల్లో విజయాలు నమోదు చేశాయి. గతంలో ఈ మైదానంలో హైదరాబాద్‌ మూడు మ్యాచ్‌లాడి మూడింట్లోనూ ఓడిపోయింది. ఢిల్లీ కూడా ఆడిన ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. రాత్రి 7. 30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. పరుగుల వరద ఖాయమే.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్ ‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, కేన్ విలియమ్సన్‌/మొహమ్మద్ నబీ, వృద్ధిమాన్‌ సాహా, ప్రియమ్‌ గార్గ్/విజయ్ శంకర్‌, అభిషేక్‌శ ర్మ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, టీ నటరాజన్‌.

ఢిల్లీ: శిఖర్‌ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ ‌పంత్‌, షిమ్రాన్ హెట్‌మైయిర్‌‌, మార్కస్ స్టొయినిస్‌, అక్షర్ ‌పటేల్‌, కాగిసో రబాడా, అన్రిచ్ నోర్జె, అమిత్‌ మిశ్రా/ఆర్ అశ్విన్, ఇషాంత్‌ శర్మ.

RCB vs MI: నిన్ను చూసి గర్వపడుతున్నా బేబీ.. ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్‌ ఈమేనా!!

Story first published: Tuesday, September 29, 2020, 16:29 [IST]
Other articles published on Sep 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+