Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RCB: పడిక్కల్‌ హాఫ్ సెంచరీ.. డివిలియర్స్‌ మెరుపులు.. ఢిల్లీ లక్ష్యం 153!!

IPL 2020, DC vs RCB: Devdutt Padikkal fifty, Delhi Capitals need 153 to qualify for play-offs

అబుదాబి: అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసి.. ఢిల్లీ ముందు 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీ చేశాడు. చివరలో ఏబీ డివిలియర్స్‌ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) రాణించడంతో బెంగళూరు పోరాడే స్కోర్ చేసింది. జోష్ ఫిలిప్‌ (12; 17 బంతుల్లో, 1×4), విరాట్‌ కోహ్లీ (29; 24 బంతుల్లో, 2×4, 1×6) నెమ్మదిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె మూడు, రబాడ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

టాస్‌ గెలిచిన ఢిల్లీ పీల్డింగ్‌ ఎంచుకోవడంతో బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. బెంగళూరు ఇన్నింగ్స్‌ను జోష్‌ ఫిలెప్పి, దేవదత్‌ పడిక్కల్‌లు ఆరంభించారు. ఇద్దరు భారీ షాట్లు ఆడినా.. ఢిల్లీ ఫీల్డర్లు బౌండరీలను అడ్డుకున్నారు. దీంతో వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఇక జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఫిలెప్పీ(12) పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి అతడు ఔటయ్యాడు. అనంతరం బెంగళూరు ఇన్నింగ్స్‌ను పడిక్కల్‌-కోహ్లీలు చక్కదిద్దారు. అయితే ఇద్దరు వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చి ఆచితూచి ఆడారు.

డిక్కల్‌-కోహ్లీలు సమయోచితంగా ఆడుతూ రెండో వికెట్‌కు అర్ధ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. 57 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 13 ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌ ఆడిన విరాట్.. మార్కస్ స్టోయినిస్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన మిస్టర్ 360 డివిలియర్స్‌ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే పడిక్కల్‌తో కలిసి 40 పరుగులు జత చేశాడు. అయితే నోర్జే వేసిన 16 ఓవర్‌ నాల్గో బంతికి పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి క్రిస్‌ మోరిస్‌ డకౌట్‌ అయ్యాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబె (17; 11 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి డివిలియర్స్‌ జట్టును ఆదుకున్నాడు. తొలుత వీరిద్దరు నిదానంగా ఆడినా తర్వాత బౌండరీల మోత మోగించారు. డేనియల్‌ సామ్స్ వేసిన 18వ ఓవర్‌లో వీరిద్దరు కలిసి ఒక సిక్సర్‌, రెండు బౌండరీలు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అయితే దూకుడుగా ఆడే క్రమంలో స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. చివరి ఓవర్లో కేవలం 7 పరుగులే రావడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జె మూడు వికెట్లు తీశాడు

Story first published: Monday, November 2, 2020, 21:30 [IST]
Other articles published on Nov 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+