Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RCB: తొడగొట్టిన గబ్బర్.. టాప్‌-2లో ఢిల్లీ.. ఓడినా ప్లేఆఫ్‌కు బెంగళూరు!!

IPL 2020, DC vs RCB: Delhi Capitals beat Royal Challengers Bangalore, secure top 2 finish
IPL 2020 Playoffs : DC, RCB Enter Playoffs, KKR-SRH Fate To Be Decided | Oneindia Telugu

అబుదాబి: ఐపీఎల్‌ 2020 ప్లేఆఫ్‌ బెర్తును ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖరారు చేసుకుంది. 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. సోమవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై అద్భుత విజయం సాధించి ముంబైతో పోరుకు సిద్దమయిపోయింది. బెంగళూరు ఓడినప్పటికీ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరింది. కోహ్లీసేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనను ఢిల్లీ మరో 6 బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌(54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్య రహానె (60: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.

తొడగొట్టిన గబ్బర్:

తొడగొట్టిన గబ్బర్:

153 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్ పృథ్వీ షా (9) వికెట్‌ను కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి షా బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌ ధావన్, అజింక్య రహానెలు రాణించి విజయానికి బాటలు వేశారు. శిఖర్ ధాటిగా ఆడగా.. రహానె ఆచితూచి ఆడాడు. చెత్త బంతులను మాత్రం బౌండరీలు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడీ 88 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ క్రమంలో గబ్బర్ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే ఢిల్లీ స్కోరు 107 పరుగుల వద్ద ఉండగా ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. షహబాజ్‌ అహ్మద్‌ వేసిన 13 ఓవర్‌ నాల్గో బంతికి ధావన్‌ ఔటయ్యాడు.

మెరిసిన రహానె:

మెరిసిన రహానె:

గబ్బర్ పెవిలియన్ చేరినా.. రహానె తన పోరాటం కొనసాగించాడు. శ్రేయస్ అయ్యర్‌ (7; 9 బంతుల్లో)తో కలిసి లక్ష్యాన్ని కరిగించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం అందుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే శ్రేయస్‌, రహానె వెనుదిరగడంతో మ్యాచ్‌ కాస్త ఉత్కంఠకు దారితీసింది కానీ మార్కస్ స్టాయినిస్ (10; 5 బంతుల్లో, 1×6), రిషబ్ పంత్ (8; 7 బంతుల్లో, 1×4) బ్యాట్ ఝుళిపించడంతో మరో 6 బంతులు మిగిలుండగానే ఢిల్లీ విజయతీరాలకు చేరింది. బెంగళూరు బౌలర్లలో షాబాజ్‌ రెండు.. సిరాజ్‌, సుందర్‌ చెరో వికెట్ తీశారు.

 పడిక్కల్ ఒంటరి పోరాటం:

పడిక్కల్ ఒంటరి పోరాటం:

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. ఫిలిప్‌ (12; 17 బంతుల్లో, 1×4)ను రబాడ ఔట్‌ చేయడంతో 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లీ (29; 24 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి దేవదత్‌ పడిక్కల్ ‌(50: 41 బంతుల్లో 5ఫోర్లు) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం పడిక్కల్‌, మోరిస్‌ (0) కూడా ఒకే ఓవర్‌లో వెనుదిరిగడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబె (17; 11 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి డివిలియర్స్‌ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) ఆదుకున్నాడు. తొలుత వీరిద్దరు నిదానంగా ఆడినా తర్వాత బౌండరీల మోత మోగించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె మూడు, రబాడ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

హైదరాబాద్‌ గెలిస్తే:

హైదరాబాద్‌ గెలిస్తే:

తాజా విజయంతో క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లో ముంబైతో ఢిల్లీ గురువారం తలపడనుంది. కాగా మంగళవారం ముంబై-హైదరాబాద్‌ మ్యాచ్‌తో ప్లేఆఫ్‌కు వచ్చే నాలుగో జట్టు ఎవరనేది తేలనుంది. హైదరాబాద్‌ గెలిస్తే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆ జట్టుతో బెంగళూరు శుక్రవారం తలపడుతుంది. రేపు హైదరాబాద్‌ గెలిస్తే మూడో స్థానంలోకి దూసుకెళుతుంది. అప్పుడు బెంగళూరు నాలుగో స్థానంలో ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్‌ ఓటమిపాలైతే.. కోల్‌కతాతో కోహ్లీసేన అమీతుమీ తేల్చుకుంటుంది. అప్పుడు బెంగళూరు మూడులో, కోల్‌కతా నాలుగులో ఉంటుంది.

అలా నిర్ణయించుకుంటే.. ఐపీఎల్‌లో రాణించడం ధోనీకి కష్టమే: కపిల్‌

Story first published: Monday, November 2, 2020, 23:32 [IST]
Other articles published on Nov 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+