Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌ అంటే ధోనీలా ఉండాలి.. కేకేఆర్ సారథిగా కార్తీక్‌ను తొలగించండి ప్లీజ్: శ్రీశాంత్‌

IPL 2020, DC vs KKR: S Sreesanth urges KKR to remove Dinesh Karthik as captain

ముంబై: దినేష్ కార్తీక్‌ను కెప్టెన్‌గా తొలగించాలి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యంను భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్‌ కోరాడు. కోల్‌కతా సారథ్య బాధ్యతలు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్‌కు అప్పగిస్తేనే.. ఆ జట్టు టైటిల్‌ గెలుస్తుందని శ్రీశాంత్‌ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టును నడిపించాలంటే మోర్గాన్‌ సరైన వాడని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమవుతున్న కార్తీక్‌పై కేకేఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీశాంత్‌ కూడా ఆ జాబితాలో చేరాడు.

నాలుగు మ్యాచుల్లోనూ విఫలం:

నాలుగు మ్యాచుల్లోనూ విఫలం:

ఐపీఎల్ 2020లో దినేశ్ కార్తీక్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. వరుస మ్యాచుల్లో (6, 1, 0, 30) తడబడుతున్నాడు. మరోవైపు బ్యాటింగ్‌ ఆర్డర్లోనూ అతను తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలివ్వడం లేదు. గౌతమ్ గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా విజయాల రేటు 56.48గా ఉండగా.. కార్తీక్‌ జట్టు పగ్గాలు అందుకున్నాక అది 51.52కు పడిపోయింది. దీంతో కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‌కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే:

'కోల్‌కతాను ఇయాన్‌ మోర్గాన్‌ సమర్థంగా నడిపించగలడు. ఒకవేళ దినేశ్‌ కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ఆ బాధ్యతలు మోర్గాన్‌కే అప్పగించాలి. కోల్‌కతా యాజమాన్యం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని భావిస్తున్నాను. కెప్టెన్‌ అంటే ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలా జట్టును ముందుండి నడిపించాలి' అని శ్రీశాంత్‌ అన్నాడు. 2013లో స్పాట్‌ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ నిషేధం ఎదుర్కొన్నాడు. శిక్ష ఇటీవల పూర్తవడంతో మళ్లీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో ఉన్నాడు.

ఆకట్టుకుంటున్న మోర్గాన్‌:

ఆకట్టుకుంటున్న మోర్గాన్‌:

శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 229 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఓటమిని చవిచూసింది. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్‌ (44; 18 బంతుల్లో ఒక ఫోర్‌, 5 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (36;16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సలర్లు) రాణించారు. ఇద్దరూ కోల్‌కతాను దాదాపు విజయపుటంచుల వరకూ తీసుకెళ్లారు. కానీ చివరలో ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.

కార్తీక్ మాకొద్దు బాబోయ్:

కార్తీక్ మాకొద్దు బాబోయ్:

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిన తర్వాత కెప్టెన్‌ను మార్చాలంటూ కేకేఆర్ ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. కార్తీక్‌కు బదులు ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌కు నాయకత్వ పగ్గాలు అప్పించాలని చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. 'కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ మాకొద్దు బాబోయ్', 'ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ మా‌కు కెప్టెన్‌గా కావాలి' అని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Monday, October 5, 2020, 23:13 [IST]
Other articles published on Oct 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+