అందుకే జడేజాతో బౌలింగ్ చేయించా.. ఆ తప్పిదాలే మా ఓటమికి కారణం: ధోనీ

IPL 2020,CSK vs DC : MS Dhoni Reveals Why Dwayne Bravo Didn’t Bowl Final Over | Oneindia Telugu

షార్జా: మరో ఆప్షన్ లేకపోవడంతోనే రవీంద్ర జడేజాతో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయించానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 5 వికెట్లతో ఓటమిపాలైంది. శిఖర్ ధావన్ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్) అజేయ సెంచరీకి అండగా.. చివర్లో అక్షర్ పటేల్(5 బంతుల్లో 3 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ అద్భుత విజయాన్నందుకుంది.

ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా.. ధోనీ బంతిని జడేజాకు ఇచ్చాడు. ఇక్కడ బ్రావో బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు భావించారు. ఇక మ్యాచ్ అనంతరం ధోనీని కూడా హోస్ట్ ఈ విషయాన్నే ప్రశ్నించాడు. బ్రావో ఫిట్‌గా లేకపోవడంతో ముందుగానే మైదానం వీడాడని, ఆఖరి ఓవర్‌ వేయించడానికి తన ముందు జడేజా, కరన్ శర్మ మాత్రమే ఉన్నారని, తాను జడ్డూకు బంతినిచ్చానని మహీ సమాధానమిచ్చాడు.

క్రెడిట్ ధావన్‌దే..

క్రెడిట్ ధావన్‌దే..

‘బ్రావో ఫిట్‌గా లేడు. అతను ముందే మైదానం వీడాడు. మళ్లీ రాలేదు. ఆఖరి ఓవర్‌కు నా ముందున్న ఆప్షన్ జడ్డూ,కర్ణ్ మాత్రమే. నేను జడేజాతో బౌలింగ్ చేయించా. అతి ప్రధానమైన శిఖర్ ధావన్ వికెట్ తీయలేకపోయాం. అతను ఇచ్చిన పలు అవకాశాలను చేజార్చం. అతని బ్యాటింగ్ కొనసాగుతూ ఉంటే స్ట్రైక్ రేట్ కూడా హైలో దూసుకెళ్తుంది. అలాగే పిచ్ కూడా చేజింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఇదే సాకుగా చెప్పి ధావన్ ఇన్నింగ్స్‌ను తక్కువ అంచనా వేయలేం. అతనే మా నుంచి మ్యాచ్‌ను లాగేసాడు. పూర్తి క్రెడిట్ శిఖర్ దే.

ఆ ఒక్క బంతిని మాత్రమే..

ఆ ఒక్క బంతిని మాత్రమే..

తేమ ప్రభావం అంతగా ఏం లేదు. కాకపోతే సెకండ్ బ్యాటింగ్‌కు కొంచెం పిచ్ అనుకూలించింది. మేం మరో 10 పరుగులు ఎక్కువ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. ఫస్ట్ బ్యాటింగ్ ఎప్పుడూ చేసిన 10 పరుగులు ఎక్కువే చేయాలి. ఈ మ్యాచ్‌లో మాకు లభించిన పాజిటివ్ ఏదైనా ఉందంటే అది సామ్ కరన్ చివర్ ఓవర్. వైడ్ యార్కర్స్ వేయగలవని అతన్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. మాములుగా వైడ్ యార్కర్స్ వేయడంపై అతనికి నమ్మకం లేదు. కానీ ఈ రోజు అద్భుతంగా వేసాడు. ఒక్క వైడ్ యార్కర్‌ను మాత్రమే హిట్ చేయడం కష్టం. డెత్ ఓవర్లలో అవి వేస్తేనే పరుగులను నియంత్రించవచ్చు'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన కరన్.. ఓ వికెట్‌ తీసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

గర్జించిన గబ్బర్..

గర్జించిన గబ్బర్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), అంబటి రాయుడు(25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 45 నాటౌట్) రాణించారు. అనంతరం ధావన్ అజేయ సెంచరీతో ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నుందకుంది. చెన్నై బౌలర్లలో చహర్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్, ఠాకుర్, బ్రావో చెరొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. 7 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మరోవైపు చెన్నై మాత్రం.. 6 ఓటమితో ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా కగిసో రబడా అరుదైన రికార్డు!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 7:52 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X