ఆ విషయంలో ధోనీ తప్పేమీ లేదు.. ఏ కెప్టెన్‌ అయినా సహనాన్ని కోల్పోతాడు: వార్నర్‌

IPL 2020 David Warner Reacts On 'MS Dhoni vs Paul Rieffel' Wide Controversy | Oneindia Telugu

దుబాయ్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ.. ఫీల్డ్ అంపైర్‌ పాల్‌ రీఫిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వివాదం అందరికీ తెలిసిందే. మ్యాచ్‌లో కెప్టెన్ కూల్.. హాట్ అయ్యాడు. మహీ కోపాన్ని చూసి అంపైర్ బయపడిపోయాడు. దాంతో తన నిర్ణయాన్నే మార్చుకున్నాడు. తాజాగా ఈ విషయంపై సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వార్నర్.. ఆ విషయంలో ధోనీ తప్పేమీ లేదన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏ కెప్టెన్‌ అయినా సహనాన్ని కోల్పోతాడన్నాడు.

కెప్టెన్లు భావోద్వేగాలు కోల్పోతారు

కెప్టెన్లు భావోద్వేగాలు కోల్పోతారు

'ఆరోజు మ్యాచ్‌లో అంపైర్ పాల్‌ రీఫిల్‌ బంతిని వైడ్‌గా పేర్కొని ఉంటే ఎంఎస్ ధోనీకి కోపం వచ్చేది. కానీ నిజం చెప్పాలంటే అది వైడ్ డెలివరీయే. అంపైర్‌ దాన్ని అలాగే ప్రకటించేవాడు. కానీ అదే సమయంలో ధోనీని చూసి తన నిర్ణయం మార్చుకున్నాడు' అని డేవిడ్ వార్నర్‌ తెలిపాడు. ధోనీ లాంటి దిగ్గజం అయినందున తానీ విషయం చెప్పట్లేదని.. చెన్నై కెప్టెన్‌, అంపైర్‌ ఎదురుగా నిలవడంతో అలా చూసి ఉండొచ్చన్నాడు. ప్రతీ ఒక్కరూ అలా చేస్తారని, ఒక్కోసారి కెప్టెన్లు భావోద్వేగాలు కోల్పోతారని వార్నర్‌ పేర్కొన్నాడు. ఈ విషయంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్నాడు.

వైడ్ యార్కర్‌గా

వైడ్ యార్కర్‌గా

ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు చేయాలి. 19వ ఓవర్ చేసేందుకు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌కు దిగాడు. మొదటి బంతికి రషీద్ ఖాన్ రెండు పరుగులు చేశాడు. రెండో బంతిని ఠాకూర్ వైడ్ యార్కర్‌గా వేశాడు. ఆ తరువాతి బంతిని కూడా బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేయడానికి ప్రయత్నించాడు ఠాకూర్. అదీ వైడ్ యార్కర్‌గానే వెళ్లింది. రషీద్ ఖాన్ పక్కకు జరిగి షాట్ ఆడినా.. బంతి కనెక్ట్ కాలేదు. వైడ్ లైన్ మీదుగానే బంతి వెళ్లి కీపర్ ఎంఎస్ ధోనీ చేతుల్లో పడింది.

వైడ్ కాదంటూ మహీ ఆగ్రహం

వైడ్ కాదంటూ మహీ ఆగ్రహం

ఠాకూర్ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ వైడ్‌గా ప్రకటించబోయాడు. వైడ్ ఇచ్చే క్రమంలో రెండు చేతులను చాపబోయాడు. అదే సమయంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ గట్టిగా అరిచాడు. వైడ్ కాదంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వికెట్ల వెనకల నుంచి ధోనీ పిచ్ వద్దకు వచ్చి.. అది వైడ్ కాదని చెప్పాడు. దీనితో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వైడ్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో రెండో బంతికి పరుగు రాలేదు. డగౌట్‌లో ఉన్న వార్నర్.. అంపైర్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఆపై హైదరాబాద్‌ 3 పరుగులే చేసి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ధోనీ భావోద్వేగం కోల్పోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

జనవరి 1 నుంచి దేశవాళీ క్రికెట్‌: గంగూలీ

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 8:29 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X