
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో మ్యాచ్‌కు సిద్దమైంది. శనివారం రాత్రి షార్జాలో జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును వార్నర్ సేన ఢీ కొట్టనుంది. ప్లేఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. లీగ్‌లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ 10 పాయింట్లు సాధించింది. దీంతో మిగిలిన (బెంగళూరు, ముంబై) రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. పాయింట్లకు తోడు మెరుగైన నెట్‌రన్ రేట్‌తోనే సన్‌రైజర్స్ ముందడుగు వేయగలదు. మరోవైపు ఈ మ్యాచ్ బెంగళూరు గెలిస్తే నేరుగా ప్లేఆఫ్ చేరుకుంటుంది.
బెంగళూరు మ్యాచుకు ముందు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచులో వార్నర్ 37 పరుగులు చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు అవ్వనుంది. ఐపీఎల్ లీగ్‌లో బెంగళూరుపై మహీ 39.71 సగటుతో 834 పరుగులు చేశాడు. వార్నర్ బెంగళూరుపై ఇప్పటికి 798 రన్స్ చేశాడు. వార్నర్ 17 ఇన్నింగ్స్‌లలో 798 పరుగులు చేయగా.. ధోనీ 28 ఇన్నింగ్స్‌లలో 834 రన్స్ చేశాడు. ఈరోజు జరిగే మ్యాచులో మరో 37 పరుగులు చేస్తే.. ధోనీ రికార్డు బద్దలు అవనుంది.
ఇటీవలే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సొంతం చేసున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్) ఐపీఎల్‌లో 5000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఈ మైలురాయి అందుకున్న తొలి ఓవర్‌సీస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును కూడా అధిగమించాడు. కోహ్లీ 157 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు నమోదు చేయగా.. వార్నర్ 135వ ఇన్నింగ్స్‌లోనే 5వేల మార్క్‌ను అందుకొని కొత్త రికార్డును నెలకొల్పాడు.
డేవిడ్ వార్నర్‌కు ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో భారత అభిమానుల మనసు దోచుకున్నాడు. అంతేకాదు మన తెలుగు జట్టుకు కప్ కూడా అందించాడు. ఇక కరోనా పుణ్యమాని వచ్చిన ఖాళీ సమయాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. వరుస పెట్టి తెలుగు హీరోల టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. మరింత స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నాడు. గతంలో బుట్టబొమ్మ పాటకు భార్యతో కలిసి డాన్స్ చేసిన వార్నర్.. తాజాగా మరోసారి స్టెప్పులేశాడు. డ్రెసింగ్ రూంలో బుట్టబొమ్మ పాట వినబడగానే తన చేతులను కదుపుతూ స్టెప్పేశాడు.